ఒప్పో దీపావళి సేల్‌ ఆఫర్స్‌ ఇవే

'పే జీరో, వర్రీ జీరో, విన్‌ రూ. 10 లక్షలు' పేరుతో మొదలైన ఈ సేల్‌ నవంబర్‌ 7 వరకు అందుబాటులో

Advertisement
Update:2024-10-09 14:58 IST

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ఒప్పో ఇండియాలో దీపావళి సేల్‌ను ప్రారంభించింది. ప్రత్యేక డిస్కౌంట్లు ఆఫర్‌ చేసింది. ఎంపిక చేసిన కొనుగోళ్లపై క్యాష్‌ ప్రైజ్‌లు, ఒప్పో ఫైండ్‌ ఎన్‌3 ఫ్లిప్‌ ఫోన్లను అందించనున్నది. నో కాస్ట్‌ ఈఎంఐ, జీరో డౌన్‌ పేమెంట్‌, జీరో ప్రాసెసింగ్‌ ఫీ, ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 'పే జీరో, వర్రీ జీరో, విన్‌ రూ. 10 లక్షలు' పేరుతో దీపావళి సేల్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే మొదలైన ఈ సేల్‌ నవంబర్‌ 7 వరకు అందుబాటులో ఉండనున్నది.

ఈ సేల్‌లో ఒప్పో రెనూ 12 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్‌ 27 ప్రో+ మొబైల్స్‌పై 12 నెలల నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కల్పిస్తున్నది. కోటక్‌ బ్యాంక్‌, టీవీఎస్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీబీ ఫైనాన్స్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ యూజర్లకు 6-9 నెలల పాటు జీరో ప్రాసెసింగ్‌ ఫీ, ఏడాది పాటు జీరో డౌన్‌ పేమెంట్‌ సదుపాయం అందిస్తున్నది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, బీఓబీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, కోటక్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌, ఆర్‌బీఎల్‌, డీబీఎస్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ యూజర్లకు 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ పొందవచ్చని తెలిపింది.

ఒప్పో రెనో 11 సిరీస్‌, ఒప్పో ఎఫ్‌ 25 ప్రో, ఒప్పో ఎఫ్‌27 5జీ, ఒప్పో ఏ3 ప్రో5జీ, ఒప్పో కే 12 ఎక్స్‌ 5జీ ఫోన్లపై పెద్ద మొత్తంలో డిస్కౌంట్లు ఆఫర్‌ చేసింది. నవంబర్‌ 7లోపు కొనుగోలు చేసిన వారికి ఒప్పో ఫైండ్‌ ఎ3 ప్లిప్‌, ఒప్పో ఎక్నో బడ్స్‌ 2, ఒప్పో ప్యాడ్‌, లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు స్క్రీన్‌ ప్రొటెక్షన్‌, ఒప్పో కేర్‌+ సబ్‌స్క్రిప్షన్‌, రివార్డ్‌ పాయింట్లు, క్వాస్‌ ప్రైజ్‌ సొంతం చేసుకోవచ్చని పేర్కొన్నది. ఒప్పో రిటైల్‌ స్టోర్‌, ఒప్పో ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్డ్‌,అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేసినవారు ఈ లబ్ధి పొందవచ్చు. 

Tags:    
Advertisement

Similar News