ఇస్రో నెక్స్ట్ టార్గెట్స్ ఇవే..

చంద్రుడి దక్షిణ ధృవానికి చేరుకుని ప్రపంచంలో ఏ దేశం సాధించలేని ఘనత ఇస్రో సాధించింది. తక్కువ ఖర్చుతో రకరకాల ప్రాజెక్టులను సక్సెస్ చేస్తూ.. అంతరిక్ష పరిశోధనల్లో శరవేగంగా దూసుకుపోతోంది.

Advertisement
Update:2023-08-25 11:15 IST

ఇస్రో నెక్స్ట్ టార్గెట్స్ ఇవే..

చంద్రుడి దక్షిణ ధృవానికి చేరుకుని ప్రపంచంలో ఏ దేశం సాధించలేని ఘనత ఇస్రో సాధించింది. తక్కువ ఖర్చుతో రకరకాల ప్రాజెక్టులను సక్సెస్ చేస్తూ.. అంతరిక్ష పరిశోధనల్లో శరవేగంగా దూసుకుపోతోంది. అయితే ఇస్రో మున్ముందు చేయబోతున్న ప్రాజెక్టులు కూడా అంత ఆషామాషీవి కావు. సూర్యూడి నుంచి అంగారకుడి వరకూ సోలార్ సిస్టమ్‌పై పూర్తిస్థాయిలోప్రయోగాలు చేసేందుకు భారత అంతరిక్ష సంస్థ రెడీ అవుతోంది. భవిష్యత్తులో ఇస్రో చేయబోతున్న ప్రాజెక్టుల వివరాలు ఓ సారి గమనిస్తే..

సూర్యుడి దగ్గరగా..

చంద్రుడిపై విజయవంతంగా రోవర్‌‌ను దింపిన ఇస్రో.. తన నెక్స్ట్ టార్గెట్‌గా సూర్యుడిని పెట్టుకుంది. ఓ స్పేస్ షిప్‌ను సూర్యుడుకి అతి దగ్గరగా పంపేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్‌కి ‘ఆదిత్య–ఎల్‌1’ అనే పేరు పెట్టింది. భూమి నుంచి సూర్యుడి వైపుగా 15 లక్షల కిలోమీటర్ల దూరానికి ఒక అబ్జర్వేటరీని పంపి సూర్యుడిపై పరిశోధనలు చేయనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ప్రయోగదశకు చేరుకోవచ్చు.

శుక్రుడి పైకి..

భూమికి పక్కనే ఉన్న శుక్ర గ్రహానికి కూడా స్పేస్ షిప్‌ను పంపే ప్లాన్‌లో ఉంది ఇస్రో. భూమికి, వీనస్ గ్రహానికి చాలా దగ్గరి పోలికలుంటాయి. అందుకే ఆ గ్రహం మీది వాతావరణంపై పరిశోధనలు చేయడం ద్వారా మన వాతావరణంలో వస్తున్న మార్పులను అంచనా వేయొచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ఇస్రో ‘శుక్రయాన్’ అని పేరు పెట్టింది.

గగన్‌యాన్‌

సొంత టెక్నాలజీతో అంతరిక్షంలోకి మనిషిని పంపాలన్నది ఇస్రోకి ఎప్పటినుంచో ఉన్న కల. అందుకే ‘గగన్‌యాన్‌’ పేరుతో మానవసహిత అంతరిక్ష యాత్రకు ఇస్రో ప్లాన్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్‌పై ఎంతోకాలంగా సైంటిస్టులు పనిచేస్తున్నారు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది గగన్‌యాన్‌ పట్టాలెక్కొచ్చు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ముగ్గురు ఇండియన్ ఆస్ట్రోనాట్స్.. మూడురోజుల పాటు స్పేస్ లో గడపనున్నారు.

మళ్లీ మార్స్ పైకి..

ఇప్పటికే ఇస్రో మార్స్ ఆర్బిట్‌లోకి శాటిలైట్ పంపి సక్సెస్ అయింది. అయితే మళ్లీ రెండోసారి మార్స్‌పైకి రోవర్ లేదా శాటిలైట్‌ను పంపేందుకు ప్లాన్ చేస్తుంది. చంద్రయాన్ తరహాలో మార్స్ పైకూడా రోవర్‌‌ను ల్యాండ్ చేయాలన్నది ఇస్రో ప్లాన్.

ఇకపోతే చంద్రయాన్‌–3 సక్సెస్ తర్వాత చంద్రయాన్–4 కోసం కూడా ఇస్రో ప్లాన్ చేస్తుంది. చంద్రుని ధృవాల వద్ద ఉన్న మూలకాలపై పరిశోధన చేయడం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. అలాగే చంద్రుడిపై నీరు, మంచు వంటి విషయాలను కూడా ఇందులో శోధిస్తారు.

Tags:    
Advertisement

Similar News