స్టోరేజ్ ప్రాబ్లమ్స్‌కు క్లౌడ్స్‌తో చెక్ పెట్టండిలా..

ఫోన్‌లో మెమరీ ఫుల్ అవ్వడమనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. మొబైల్‌లో ఇంటర్నల్ స్టోరేజీ నిండగానే ‘స్టోరేజ్ ఫుల్.. డిలీట్ ఐటమ్స్’ అని మెసేజ్ కనిపిస్తుంటుంది.

Advertisement
Update:2023-08-01 13:07 IST

స్టోరేజ్ ప్రాబ్లమ్స్‌కు క్లౌడ్స్‌తో చెక్ పెట్టండిలా..

ఫోన్‌లో మెమరీ ఫుల్ అవ్వడమనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. మొబైల్‌లో ఇంటర్నల్ స్టోరేజీ నిండగానే ‘స్టోరేజ్ ఫుల్.. డిలీట్ ఐటమ్స్’ అని మెసేజ్ కనిపిస్తుంటుంది. దాంతో చాలామంది మొబైల్‌లో ఉన్న పెద్ద ఫైల్స్‌ను డిలీట్ చేస్తుంటారు లేదా యాప్స్ అన్‌ఇన్‌స్టాల్ చేస్తుంటారు. అయితే కొన్ని క్లౌడ్ యాప్స్‌ను వాడడం ద్వారా స్టోరేజీ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అదెలాగంటే..

మొబైల్‌లో ఉండే పర్సనల్ డేటాను క్లౌడ్‌ స్టోరేజ్‌లో సేవ్‌ చేసుకుంటే ఫోన్‌లో ఎప్పుడూ..‘ స్టోరేజ్‌ ఫుల్’ అనే మెసేజ్‌ రాదు. ఇంటర్నెట్ సాయంతో క్లౌ్డ్‌లో డేటాను భద్రపరిచే యాప్స్ బోలెడు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని బెస్ట్ ఆప్షన్స్ ఇవీ..

అమెజాన్ డ్రైవ్

అమెజాన్‌ తీసుకొచ్చిన క్లౌడ్‌ బేస్డ్ స్టోరేజ్‌ యాప్‌ ఇది. అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్లు ఈ సేవలను ఉచితంగా పొందొచ్చు. అపరిమిత బ్యాకప్‌తో పాటు 5 జీబీ ఫ్రీ స్టోరేజీని అమెజాన్‌ డ్రైవ్‌ అందిస్తోంది. అన్‌లిమిటెడ్ స్టోరేజీ కావాలనుకుంటే సంవత్సరానికి రూ. 700 చెల్లించాల్సి ఉంటుంది.

డ్రాప్‌ బాక్స్‌

క్లౌడ్ స్టోరేజీ ఆప్షన్స్‌లో డ్రాప్‌ బాక్స్‌ చాలా పాపులర్. ఈ క్లౌడ్‌కు చాలామంది యూజర్లు ఉన్నారు. ఇందులో 2జీబీ వరకు ఫ్రీ క్లౌడ్‌ స్టోరేజీని పొందొచ్చు. ఆపై నెలకు రూ. 1200 చెల్లిస్తే 2 టీబీ స్టోరేజ్‌ను ఆరుగురు యూజర్లు వాడుకునే వీలుంటుంది.

గూగుల్‌ డ్రైవ్‌

గూగుల్ డ్రైవ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్స్‌లో గూగుల్ డ్రైవ్ డీఫాల్ట్‌గా ఎనేబుల్ అయ్యి ఉంటుంది. అయితే చాలామంది గూగుల్ డ్రైవ్ అందించే 15 జీబీ ఉచిత స్టోరేజీనే వాడుతుంటారు. అదనంగా నెలకు సుమారు రూ. 150 చెల్లిస్తే.. 100జీబీ డేటా వరకూ స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు.

మైక్రోసాఫ్ట్‌ వన్‌డ్రైవ్‌

విండోస్ ప్లాట్‌ఫామ్స్‌పై పనిచేసేవాళ్లకు మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్ చాలా సులభతరంగా ఉంటుంది. మైక్రోసాఫ్ట్ యాప్స్‌ను వన్‌డ్రైవ్‌తో ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. వన్‌డ్రైవ్‌లో యూజర్లు 5జీబీ వరకు ఫ్రీ క్లౌడ్‌ స్టోరేజ్‌ను పొందొచ్చు. సంవత్సరానికి రూ. 1500 చెల్లిస్తే 100 జీబీ వరకు క్లౌడ్‌ స్టోరేజ్‌ పొందొచ్చు.

ఆటోసింక్‌

ఆటోసింక్ అనేది ప్రముఖ క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్‌ఫామ్. ఈ యాప్‌లో యూజర్లు గూగుల్‌ డ్రైవ్‌, వన్‌డ్రైవ్‌, డ్రాప్‌ బాక్స్‌ వంటి ఇతర క్లౌడ్‌ యాప్స్‌ను కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. నెలకు సుమారు రూ. 745 చెల్లిస్తే అన్‌లిమిటెడ్ స్టోరేజీ పొందొచ్చు.

ట్రెసోరిట్

ట్రెసోరిట్ అనేది కొత్తగా వచ్చిన క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్‌ఫామ్. క్లౌడ్‌లో సేవ్ చేసిన ఫైల్స్‌కు ఫుల్ సెక్యూరిటీ అందించడం ఈ యాప్ స్పెషాలిటీ. ఇందులో అప్‌లోడ్ అయిన ప్రతి ఫైల్.. ‘ఎండ్-టు-ఎండ్’ ఎన్‌క్రిప్షన్‌ను కలిగి ఉంటుంది. మొదటగా 1 జీబీ వరకు ఉచిత స్టోరేజీని పొందొచ్చు. ఆపైన నెలకు వెయ్యి రూపాయలు చెల్లించి 500జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ పొందొచ్చు.

Tags:    
Advertisement

Similar News