స్టార్‌ షిప్‌ ప్రయోగం సక్సెస్‌

నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్‌.. లాంచ్‌ ప్యాడ్‌ వద్దకు తిరిగి వచ్చిన బూస్టర్‌

Advertisement
Update:2024-10-13 23:46 IST

ఎలన్‌ మస్క్‌ కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ చేపట్టిన స్టార్‌ షిప్‌ ప్రయోగం సక్సెస్‌ అయ్యింది. స్టార్‌ షిప్‌ ప్రయోగాల్లో ఇది ఐదవది. ఈ ప్రయోగం విజయవంతమైందని ఎలన్‌ మస్క్‌ ఎక్స్‌ లో పోస్ట్‌ చేశారు. ఆదివారం టెక్సస్‌ దక్షిణ తీరంలో ఈ రాకెట్‌ ప్రయోగించారు. బూస్టర్‌, స్పేస్‌ క్రాఫ్ట్‌ తో కూడిన భారీ రాకెట్‌ ప్రయోగంలో స్పేస్‌ క్రాఫ్ట్‌ హిందూ మహా సముద్రంలో దిగగా బూస్టర్‌ లాంచ్‌ ప్యాడ్‌ వద్దకు తిరిగి చేరుకుంది. 71 మీటర్ల బూస్టర్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌ విజయవంతంగా నింగిలోకి మోసుకెళ్లింది. ఆ తర్వాత లాంచ్‌ ప్యాడ్‌ వద్దకు తిరిగివచ్చింది. లాంచ్‌ ప్యాడ్‌ వద్ద ఉన్న చాప్‌ స్టిక్స్‌ బూస్టర్‌ ను ఒడిసి పట్టుకున్నాయి. అంతరిక్ష ప్రయోగాల్లో ఇదో ఇంజనీరింగ్‌ మిరాకిల్‌ అని సైంటిస్టులు చెప్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News