స్పేస్‌లో వికసించిన పువ్వు.. సోషల్ మీడియాలో వైరల్!

నాసా చేసిన ప్రయోగంలో మొక్కలు స్పేస్ వాతావరణ పరిస్థితులను తట్టుకుని పెరగడమే కాకుండా ఒక మొక్క షష్పించింది కూడా.

Advertisement
Update:2023-06-15 17:50 IST

Zinnia Flower in Space: స్పేస్‌లో వికసించిన పువ్వు.. సోషల్ మీడియాలో వైరల్!

అంతరిక్షంలో జీవం ఉంటుందా? మనిషి బతకగలడా? లేదా? అన్నది తెలుసుకోవడం కోసం ఇప్పటివరకూ ఎన్నో పరిశోధనలు జరిగాయి. అయితే తాజాగా నాసా.. ‘స్పేస్‌లో మొక్కలు పెరుగుతాయా? లేదా?’ అనే అంశంపై ఓ రీసెర్చ్ చేసింది. ఇందులో వెల్లడైన విషయాలు ప్రస్తుతం సైంటిస్టులను ఆశ్చర్యపరుస్తున్నాయి.


నాసా చేసిన ప్రయోగంలో మొక్కలు స్పేస్ వాతావరణ పరిస్థితులను తట్టుకుని పెరగడమే కాకుండా ఒక మొక్క షష్పించింది కూడా. అత్యంత అసాధారణమైన వాతావరణంలో పువ్వు పుష్పించడం అనేది అద్భుతమైన విషయమని సైంటిస్టులు అంటున్నారు.


స్పేస్‌లో జీవించడంపై చేస్తున్న పరిశోధనలకు ఈ ప్రయోగం చాలా హెల్ప్ ఫుల్‌గా ఉంటుందని చెప్తున్నారు. స్పేస్‌లో పుష్పించిన పువ్వు ఫోటోని రీసీంట్‌గా నాసా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఈ పువ్వు ‘జినియా’ అనే మొక్క నుంచి వికసించింది. ప్రస్తుతం ఈ పువ్వు పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు ఇది అద్భుతంగా ఉందని, ఎంతో అందంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఈ పోస్ట్‌కు ఆరు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.



స్పేస్ సైంటిస్టులు1970ల నుంచే అంతరిక్షంలో మొక్కల పెంపకంపై అధ్యయనం చేస్తున్నారు. అయితే 2015లో అమెరికన్ ఆస్ట్రోనాట్ కెజెల్‌ లిండర్‌‌గెన్‌ మొక్కల పెంపకానికి సంబంధించి ప్రత్యేక ప్రయోగం చేసినట్లు నాసా పోస్టులో రాసుకొచ్చింది. అలాగే స్పేస్ నుంచి పాలకూర, టమాటోలు, చిల్లీలను కూడా రాబోయే రోజుల్లో ఆశించొచ్చని నాసా వెల్లడించింది.

Tags:    
Advertisement

Similar News