ఆకాశానికి నిచ్చెన వేస్తున్నారు!

ఆకాశానికి నిచ్చెన వేస్తే ఎలా ఉంటుంది.. ఆ ఊహే చాలా బాగుంది కదూ! అయితే అది నిజంగా జరగడం సాధ్యమేనా? అంటే.. సాధ్యమే అంటున్నారు సైంటిస్టులు.

Advertisement
Update:2023-08-18 10:00 IST

ఆకాశానికి నిచ్చెన వేస్తే ఎలా ఉంటుంది.. ఆ ఊహే చాలా బాగుంది కదూ! అయితే అది నిజంగా జరగడం సాధ్యమేనా? అంటే.. సాధ్యమే అంటున్నారు సైంటిస్టులు. అదెలాగంటే..

రోజురోజుకి టెక్నాలజీలో చాలా అడ్వాన్స్‌మెంట్స్ వస్తున్నాయి. భూమిని దాటి చంద్రుణ్ణి, చంద్రుణ్ణి దాటి మార్స్.. ఇలా ఇతర గ్రహాల్ని కూడా చేరుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఆకాశానికి నిచ్చెన వేసే ప్లాన్‌లో ఉన్నారు కేంబ్రిడ్జి యూనివర్సిటీ సైంటిస్టులు. ఈ పరిశోధన్ని ‘స్పేస్ ఎలివేటర్ ప్రాజెక్ట్‌’ అంటారు. కొలంబియా, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు స్పేస్‌ ఎలివేటర్‌ తయారు చేయడానికి, దాని డిజైన్‌కు ప్లాన్‌లు గీస్తున్నారు. అయితే ఈ నిచ్చెన భూమ్మీది నుంచి మొదలవ్వదట. చంద్రుడి నుంచి కిందకి వేలాడుతుందట.

ప్లానింగ్ దశలో..

స్పేస్ ఎలివేటర్ ప్రాజెక్ట్‌ కేవలం ఒక సైంటిఫిక్ ప్లాన్ మాత్రమే. ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ కావడానికి ఇంకా కొన్నేళ్లు టైం పట్టొచ్చు. సైంటిస్టులు చేసిన డిజైన్ ప్రకారం.. చంద్రుడిపై బలమైన తీగ లాంటిదాన్ని బిగించి దాన్ని భూమి కక్ష్య వరకు వేలాడేలా చేస్తారు. భూమ్మీది నుంచి వెళ్లే రాకెట్లు ఈ తీగ సహాయంతో ఒక ఎండ్‌కు చేరుకుంటాయి. ఆ ఎండ్ దగ్గరే రాకెట్లు పార్క్ చేస్తారు. ఆ తర్వాత ఆస్ట్రోనాట్‌లు ఈ తీగ వెంబడి మరో రాకెట్‌లో స్పేస్ ట్రావెల్ చేసి ఈజీగా చంద్రుణ్ణి చేరుకుంటారు. మాములుగా రాకెట్ ద్వారా స్పేస్‌లో ప్రయాణించాలంటే.. దారిలో ఎన్నో అడ్డంకులను ఫేస్ చేయాల్సి వస్తుంది. మధ్యలో ఎప్పుడు, ఏ ఆస్టరాయిడ్ వచ్చి తగులుతుందో తెలీదు. అదే ఈ తీగ వెంబడి అయితే ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అంతేకాకుండా ఈ ప్రయోగం ద్వారా తక్కువ ఫ్యూయెల్‌తోనే ఎక్కువ దూరం ప్రయాణించొచ్చు. పైగా ఈ శక్తిని కూడా సౌరశక్తితో అక్కడికక్కడే జనరేట్ చేసుకోవచ్చు.

అంతా రెడీ

ఈ స్పేస్‌లైన్‌ను నిర్మించేందుకు కావాల్సిన అన్ని టెక్నాలజీలు, మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయని జెఫైర్‌ పెనైరీ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఇప్పటికే అమెరికా, చైనా, రష్యా లాంటి అగ్రరాజ్యాలు చంద్రుడిపై మకాం వేయాలని ప్రయోగాలు చేస్తున్నాయి. స్పేస్ ఎక్స్ సంస్థ ఇంకో నాలుగేళ్లలో అంగారకుడిపై కాలనీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ఇవన్నీ సాధ్యం కావాలంటే ఇలాంటి నిచ్చెన కచ్చితంగా అవసరమవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా తక్కువ ఖర్చుతో ఆస్ట్రోనాట్‌లు చంద్రుడి మీదకు చేర్చడం మాత్రమే కాకుండా.. భవిష్యత్తులో ఇతర గ్రహాలకు వెళ్లేందుకు కూడా ఈ స్పేస్‌లైన్‌.. కీ ఫ్యాక్టర్ గా మారుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఫ్యూచర్‌‌లో ఈ స్పేస్‌లైన్‌ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే స్పేస్‌లో ఎన్నో అంతరిక్ష పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు కూడా వీలుంటుందని చెప్తున్నారు.

Tags:    
Advertisement

Similar News