ఏప్రిల్‌లో రాబోతున్న మంచి మొబైల్స్ ఇవే!
ఎప్పటిలాగానే వచ్చే నెలలో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ మొబైల్స్ లాంచ్ అవ్వనున్నాయి.
ఎప్పటిలాగానే వచ్చే నెలలో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ మొబైల్స్ లాంచ్ అవ్వనున్నాయి. అయితే వీటిలో ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ కంటే మిడ్‌రేంజ్ బడ్జెట్‌లో మంచి పెర్ఫామెన్స్ ఇచ్చే మొబైల్స్ ఎక్కువగా ఉన్నాయి. లిస్ట్‌లోకి వెళ్తే..
ఏప్రిల్ నెలలో శాంసంగ్ నుంచి ‘గెలాక్సీ ఎం15’ మొబైల్ రానుంది. దీని ధర సుమారు రూ. 13,000 వరకూ ఉండొచ్చు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6100 + ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. 6.5 ఇంచెస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 5 ఎంపీ సెకండరీ సెన్సర్, 2 ఎంపీ డెప్త్ సెన్సర్, 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటాయి
శాంసంగ్ ఎం 55
శాంసంగ్ నుంచి ‘గెలాక్సీ ఎం55’ అనే మరో మొబైల్ కూడా వచ్చే నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. 50ఎంపీ సెన్సర్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ధర సుమారు రూ.30,000 వరకు ఉండొచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4
చాలామంది వెయిట్ చేస్తున్న ‘వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4’ మొబైల్ ఏప్రిల్ 1న ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవ్వనుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 6.7 ఇంచెస్ 1.5కె రిజల్యూషన్ అమోలెడ్ డిస్‌ప్లే ఉండనుంది. 50ఎంపీ+8 ఎంపీ రేర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా సెటప్‌తో వస్తుంది.
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో
వచ్చే నెల 3న మోటొరోలా నుంచి ‘మోటొ ఎడ్జ్ 50 ప్రో’ మొబైల్ లాంచ్ అవ్వనుంది. ఇదిస్నాప్డ్రాగన్ 8జెన్ 3 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇందులో 144హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో కూడిన 6.7 అంగుళాల కర్వ్డ్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. 50ఎంపీ సెన్సర్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
పోకో ఎఫ్ 6
పోకో బ్రాండ్ నుంచి వచ్చే నెలలో ‘పోకో ఎఫ్ 6’ మొబైల్ రానుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ఎస్ జెన్ 3 ప్రాసెసర్ వాడారు. బడ్జెట్‌లో గేమింగ్ చేయాలనుకునేవాళ్లను టార్గెట్ చేస్తూ ఈ మొబైల్ రానుంది. ఇందులో 6.6 ఇంచెస్ ఓఎల్‌ఈడీ డిస్ ప్లే ఉంటుంది. 50 ఎంపీ+8 ఎంపీ+ 2 ఎంపీ రేర్ కెమెరా సెటప్, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉండనున్నాయి. 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.