త్వరలో శాంసంగ్ నుంచి ‘ఎం55’ మొబైల్! ఫీచర్లు ఇవే!

శాంసంగ్ గెలాక్సీ ఎం55 ఈ ఏడాది మేలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Advertisement
Update:2024-03-21 09:42 IST

సౌత్ కొరియన్ బ్రాండ్ శాంసంగ్ నుంచి త్వరలో ఓ మిడ్‌రేంజ్ 5జీ ఫోన్ రాబోతోంది. శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్ లో భాగంగా ‘ఎం55.. 5జీ’ పేరుతో ఈ మొబైల్ రానుంది. ఈ ఫోన్ అఫీషియల్‌గా ఎప్పుడు లాంఛ్ అవుతుందో తెలియనప్పటికీ ఈ ఫోన్ ఫీచర్లు మాత్రం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎం55 ఈ ఏడాది మేలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త మొబైల్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్‌లో సరికొత్త డిజైన్‌లో కనిపిస్తుంది. ఇక ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే..

శాంసంగ్ గెలాక్సీ ఎం55 మొబైల్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 1 ఎస్‌వోసీ ఆక్టాకోర్ ప్రాసెసర్ పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ శాంసంగ్ వన్ యూఐపై రన్ అవుతుంది. ఇందులో 6.7 ఇంచెస్ ఫుడ్ హెచ్ డీ+ అమోలెడ్ డిస్ ప్లే ఉండనుంది. ఇది 120 హెర్ట్జ్‌ రిఫ్రెష్ రేటును సపోర్ట్ చేస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం55 మొబైల్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండబోతోంది. ఇందులో 108ఎంపీ ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో పాటు, 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2ఎంపీ మాక్రో సెన్సర్ ఉండనున్నాయి. ముందువైపు సెల్ఫీల కోసం 32ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది.

ఈ మొబైల్‌లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. ఇది బ్లూ, బ్లాక్ షేడ్స్‌లో అందుబాటులో ఉండొచ్చు. డ్యూయల్ నానో సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0 వంటి ఫీచర్ల ఉండొచ్చు. ఈ మొబైల్ 8జీబీ + 256జీబీ బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 30,000 వరకూ ఉండొచ్చు.

Tags:    
Advertisement

Similar News