రెడ్‌మీ నుంచి సరికొత్త ‘టర్బో’ సిరీస్ ఫోన్! ప్రత్యేకతలివే..

ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్ షావోమీకి చెందిన రెడ్‌మీ నుంచి త్వరలో ఓ కొత్త సిరీస్ రాబోతుంది. ‘రెడ్‌మీ టర్బో3’ పేరుతో ఆ సిరీస్ నుంచి మొదటి మొబైల్ త్వరలోనే రిలీజ్ అవ్వనుంది.

Advertisement
Update:2024-04-11 07:08 IST

ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్ షావోమీకి చెందిన రెడ్‌మీ నుంచి త్వరలో ఓ కొత్త సిరీస్ రాబోతుంది. ‘రెడ్‌మీ టర్బో3’ పేరుతో ఆ సిరీస్ నుంచి మొదటి మొబైల్ త్వరలోనే రిలీజ్ అవ్వనుంది. ఈ సిరీస్ ప్రత్యేకతలు ఏంటంటే..

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మీ బ్రాండ్‌కి మంచి వాల్యూనే ఉంది. అయితే గత కొన్నేళ్లుగా రెడ్‌మీ నుంచి వస్తున్న ‘నోట్’ సిరీస్ ఫోన్లు అంతగా సక్సెస్ అవ్వట్లేదు. అయితే ఇప్పుడు ‘రెడ్‌మీ టర్బో’ పేరుతో ఓ కొత్త సిరీస్‌ను తీసుకురాబోతోంది షావోమీ. ఈ సిరీస్ ఫోన్లలో డిజైన్, కెమెరా విభాగాలపై ఎక్కువ ఫోకస్ ఉండనుంది.

ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఇంచెస్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎస్‌ జెన్ 3 ఎస్ఓసీ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

రెడ్ మీ టర్బో 3 స్మార్ట్‌ఫోన్ వెనుక డ్యుయల్ కెమెరా సెటప్ అమర్చారు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కలిగి ఉన్న 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు మరో సెకండరీ కెమెరా, ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉండనున్నాయి. బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 90 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

ఈ మొబైల్ అత్యంత స్లిమ్ డిజైన్‌తో, పెర్ఫామెన్స్ ఫోన్‌గా మిడ్‌రేంజ్ ఫ్లాగ్‌షిప్ కేటగిరీలో లాంఛ్ అవ్వనున్నట్టు సమాచారం. బేస్‌ వేరియంట్ ధర సుమారు రూ.25,000 మధ్య ఉండొచ్చు. అలాగే ఈ ఫోన్‌లో 5జీ కనెక్టివిటీ, అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, డ్యుయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ సపోర్ట్, ఐఆర్ బ్లాస్టర్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి

ఈ మొబైల్ టాప్ వేరియంట్ 16 జిబీ+ 1 టీబీ వరకూ ఉంటుంది. వైట్‌, బ్లాక్‌ కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఈ మొబైల్ ప్రస్తుతం చైనాలో రిలీజ్ అంవుతోంది. ఇండియన్ మార్కెట్‌కు ఎప్పుడొస్తుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News