రెడ్‌మీ నుంచి బడ్జెట్ ఫోన్ రిలీజ్! ఫీచర్లివే..

రెడ్‌మీ నుంచి ‘రెడ్‌మీ ఏ3ఎక్స్(Redmi A3X)’ పేరుతో ఇండియన్ మార్కె్ట్లో కొత్త ఫోన్ లాంఛ్ అయింది. పదివేల రూపాయల లోపు బడ్జెట్లో రిలీజైన ఈ ఫోన్‌లో మంచి డిజైన్, గొరిలా గ్లాస్ స్క్రీన్ వంటి ఫీచర్లున్నాయి.

Advertisement
Update: 2024-08-19 09:25 GMT

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ రెడ్‌మీ నుంచి రీసెంట్‌గా ఎంట్రీ లెవల్ బడ్జెట్ ఫోన్ రిలీజయింది. ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్ల వివరాల్లోకి వెళ్తే..

రెడ్‌మీ నుంచి ‘రెడ్‌మీ ఏ3ఎక్స్(Redmi A3X)’ పేరుతో ఇండియన్ మార్కె్ట్లో కొత్త ఫోన్ లాంఛ్ అయింది. పదివేల రూపాయల లోపు బడ్జెట్లో రిలీజైన ఈ ఫోన్‌లో మంచి డిజైన్, గొరిలా గ్లాస్ స్క్రీన్ వంటి ఫీచర్లున్నాయి.

రెడ్ మీ ఏ3ఎక్స్ మొబైల్ యూనిసాక్ టీ 603 ప్రాసెసర్‌‌పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హైపర్ ఓఎస్ వర్షన్‌పై రన్ అవుతుంది. ఇందులో డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది.8-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌‌తో పాటు మరో సెకండరీ డెప్త్ సెన్సర్, ముందువైపు 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

రెడ్‌మీ ఏ3ఎక్స్ ఫోన్‌లో 6.71 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్సీడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుని సపోర్ట్ చేస్తుంది. 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. స్క్రీన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ ఉంది. అలాగే ఇందులో 10 వాట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

రెడ్‌మీ ఏ3ఎక్స్ మొబైల్ 4జీ ఎల్‌టీఈ సపోర్ట్‌తో వస్తుంది. వై-ఫై 5.4, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టివిటీ ఉంటాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. ఓఎస్ కు రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, మూడేళ్లపాటుసెక్యూరిటీ అప్‌డేట్స్ వస్తాయి.

రెడ్‌మీ ఏ3ఎక్స్ మొబైల్ 3జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.6,999 ఉంది. 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,999 ఉంది. మిడ్ నైట్ బ్లాక్, ఓషియన్ గ్రీన్, ఆలివ్ గ్రీన్, స్టారీ వైట్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.

Tags:    
Advertisement

Similar News