Realme Narzo N53 | 18న మార్కెట్‌లో అత్యంత స్లిమ్ ఫోన్ రియల్‌మీ నార్జో ఎన్53 లాంచ్!
Realme Narzo N53: `స్లిమ్మెస్ట్ రియల్‌మీ స్మార్ట్ ఫోన్`.. రియల్ మీ నార్జో ఎన్53 (Realme Narzo N53) భారత్ మార్కెట్‌లోకి ఎంటరయ్యే ముహూర్తం ఖరారైంది.
`స్లిమ్మెస్ట్ రియల్‌మీ స్మార్ట్ ఫోన్`.. రియల్ మీ నార్జో ఎన్53 (Realme Narzo N53) భారత్ మార్కెట్‌లోకి ఎంటరయ్యే ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18న మార్కెట్‌లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. రియల్‌మీ నార్జో ఎన్ సిరీస్ ఫోన్లలో ఇది రెండోవది. ఈ ఏడాది ప్రారంభంలో రియల్‌మీ నార్జో ఎన్55 ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. గత వారం న్యూ కలర్ వేరియంట్ కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో రియల్‌మీ నార్జో ఎన్53 (Realme Narzo N53) ఫోన్ ఆవిష్కరణకు సంబంధించి పలు అంశాలు అమెజాన్ మైక్రోసైట్ బయట పెట్టింది.
రియల్‌మీ నార్జో ఎన్33 (Realme Narzo N53) ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ యూనిట్ విత్ 33వాట్ల సూపర్ వూక్ వైర్‌డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నది. కేవలం 34 నిమిషాల్లో 50 శాతం ఫోన్ చార్జింగ్ అవుతుంది. ఓవర్ హీటింగ్, చార్జింగ్ సమయంలో టెంపరేచర్ ప్రొటెక్షన్ ఫీచర్ ఉంటుంది.
రానున్న రియల్‌మీ నార్జో ఎన్33 (Realme Narzo N53) సిరీస్ స్మార్ట్ ఫోన్.. గోల్డ్, బ్లాక్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. కాలిఫోర్నియా సన్‌షైన్ పేరుతో గోల్డెన్ వేరియంట్‌గా మార్కెట్లోకి రానున్నది. రియల్‌మీ నార్జో ఎన్53 ఫోన్ గోల్డ్ ఫిలమెంట్ కోటింగ్‌తో వస్తున్నది. రియల్‌మీ నార్జో ఎన్53 ఫోన్ థిక్‌నెస్ 7.49 ఎంఎంతో కలిగి ఉంటుంది. ఇంతకుముందు వచ్చిన రియల్‌మీ నార్జో ఎన్55 ఫోన్ కంటే స్లిమ్‌గా ఉంటుంది. రియల్ మీ నార్జో ఎన్55 ఫోన్ థిక్‌నెస్ 7.89 ఎంఎం కలిగి ఉంటుంది.
గత నెలలో రియల్‌మీ నార్జో ఎన్55 ఫోన్ పేరిట రియల్ మీ తన నార్జో ఎన్-సిరీస్ తొలి స్మార్ట్ ఫోన్ భారత్ మార్కెట్‌లో విడుదల చేసింది. 4జీబీ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ రామ్, 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్లు రూ.10,999, రూ.12,999 ధరలకు అందుబాటులోకి వచ్చాయి. రియల్‌మీ నార్జో ఎన్55 ఫోన్.. ప్రైమ్ బ్లాక్, ప్రైమ్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభించింది.
రియల్‌మీ నార్జో ఎన్55 ఫోన్.. మీడియా టెక్ హెలియో జీ88 ఎస్వోసీ విత్ ఎల్పీడీడీఆర్4ఎక్స్ రామ్ అండ్ యూఎఫ్ఎస్ 2.2 ఇన్ బిల్ట్ స్టోరేజీతో వస్తున్నది. ఆండ్రాయిడ్ 13 ఔట్ ఆఫ్ ది బాక్స్ విత్ రియల్‌మీ యూఐ ఆన్ టాప్ వర్షన్‌తో పని చేస్తున్నది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ విత్ 33 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌గా ఉంటుంది.