Realme C53 | 108 మెగా పిక్సెల్స్ కెమెరాతో రియల్ మీ బడ్జెట్ ఫోన్.. ఇవీ డిటైల్స్..!
Realme C53 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ రియల్ మీ (Realme) భారత్ మార్కెట్లోకి బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ రియల్ మీ సీ53 4జీ (Realme C53), రియల్‌మీ పాడ్-2లను ఆవిష్కరించింది.
Realme C53 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ రియల్ మీ (Realme) భారత్ మార్కెట్లోకి బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ రియల్ మీ సీ53 4జీ (Realme C53), రియల్‌మీ పాడ్-2లను ఆవిష్కరించింది. 108-మెగా పిక్సెల్స్ ప్రైమరీ సెన్సర్‌తో కూడిన డ్యుయల్ రేర్ కెమెరాతో వస్తున్నది. ఈ సెగ్మెంట్‌లో 108-మెగా పిక్సెల్స్ కెమెరాతో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇదే. రియల్ మీ పాడ్-2.. 11-5 అంగుళాల డిస్‌ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 8360 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
రియల్ మీ సీ 53 (Realme C53) ఫోన్ ధర రూ.9,999 (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నది. అంతేకాదు రూ.1.17 లక్షల విలువ గల ఆపిల్ ఐ-ఫోన్-14 ప్రో ఫోన్‌లో వినియోగించే డైనమిక్ ఐలాండ్ ఫంక్షనల్లీ ఫీచర్ `మినీ క్యాప్సూల్` కూడా ఇస్తున్నది. ఇంతకుముందు రియల్ మీ సీ 55 ఫోన్‌లోనూ ఈ ఫీచర్ ఇచ్చింది.
రెండు వేరియంట్లలో రియల్ మీ సీ53 (Realme C53) వస్తుంది. బేస్ వేరియంట్ 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,999, 6జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.10,999లకు లభిస్తుంది. రియల్ మీ డాట్ కామ్, ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ నెల 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్‌లైన్‌లో సేల్స్ ప్రారంభం అవుతాయి. హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేస్తే రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది.
కృత్రిమ మేధ మద్దతుతో కూడిన 108-మెగా పిక్సెల్స్ ప్రైమెరీ సెన్సర్ కెమెరా, వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 8-మెగా పిక్సెల్స్ సెన్సర్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండి. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో రెండు టిగా బైట్స్ వరకు ఫోన్ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం పెంచుకోవచ్చు. చాంపియన్ గోల్డెన్, చాంపియన్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
రియల్ మీ సీ53 (Realme C53) ఫోన్ ఆండ్రాయిడ్ 13-బేస్డ్ రియల్‌మీ యూఐ టీ-ఎడిషన్ వర్షన్‌పై పని చేస్తుంది. 6.74-అంగుళాల డిస్‌ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 90.3 స్క్రీన్ టు బాడీ రేషియో, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తున్నది ఈ ఫోన్ యూనిసోక్ టీ-612 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. 560 నిట్స్ బ్రైట్‌నెస్ లభిస్తుంది.
రియల్ మీ సీ53 ఫోన్ 4జీ, జీపీఎస్ / ఏజీపీఎస్, వై-ఫై, బ్లూటూత్ 5, 3.5 హెడ్ ఫోన్ చాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ తో వస్తుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. యాక్సెలో మీటర్, మ్యాగ్నటిక్ సెన్సర్, లైట్ సెన్సర్, గైరో మీటర్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్ లు ఉంటాయి.
ఇవీ రియల్‌మీ పాడ్-2 స్పెషిఫికేషన్స్
రియల్‌మీ పాడ్-2 11.5 అంగుళాల డిస్‌ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. 8360 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 17 గంటల పాటు వీడియో వాచింగ్, 190 గంటల మ్యూజిక్ లిజెనింగ్ పవర్ బ్యాకప్ లభిస్తుంది. 2000 X 1200 పిక్సెల్స్ రిజొల్యూషన్ అండ్ 450 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. మీడియా టెక్ హెలియో జీ99 ప్రాసెసర్ ట్యూన్డ్ విత్ మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ ఫీచర్ జత చేశారు. పాడ్-2లో 20-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా కూడా ఉంటుంది. వై-ఫై, బ్లూ-టూత్, టైప్-సీ పోర్ట్ చార్జింగ్ కనెక్టివిటీ ఉంటుంది.