Realme GT 5 Pro | రియ‌ల్‌మీ జీటీ ప్రో ఆవిష్క‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు.. ఇవీ డిటైల్స్‌..?!

Realme GT 5 Pro | వ‌చ్చేనెల ఏడో తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు చైనా మార్కెట్‌లో రియ‌ల్‌మీ జీటీ5 ప్రో (Realme GT 5 Pro) ఆవిష్క‌రిస్తారు.

Advertisement
Update: 2023-11-25 09:06 GMT

Realme GT 5 Pro | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ రియ‌ల్‌మీ (Realme) త‌న రియ‌ల్‌మీ జీటీ5 ప్రో ఫోన్ ఆవిష్క‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారైంది. అంత‌కుముందు గ‌త ఆగ‌స్టులో స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ 2 ఎస్వోసీ (Snapdragon 8 Gen 2 SoC) చిప్‌సెట్‌తో రియ‌ల్‌మీ జీటీ5 (Realme GT5) ఆవిష్క‌రించింది. రియ‌ల్‌మీ జీటీ5 (Realme GT 5)తో పోలిస్తే రియ‌ల్‌మీ జీటీ5 ప్రో (Realme GT 5 Pro) మెరుగైన ఫీచ‌ర్ల‌తో అందుబాటులోకి వ‌స్తుంద‌ని తెలుస్తున్న‌ది. వ‌చ్చేనెల ఏడో తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు చైనా మార్కెట్‌లో రియ‌ల్‌మీ జీటీ5 ప్రో (Realme GT 5 Pro) ఆవిష్క‌రిస్తారు. భార‌త్‌తోపాటు గ్లోబ‌ల్ మార్కెట్ల‌లో ఎప్పుడు ఆవిష్క‌రిస్తార‌న్న‌ది తెలియ‌లేదు. ఓవీ64బీ పెరిస్కోప్ టెలిఫోటో సెన్స‌ర్ కెమెరాతో వ‌స్తుంద‌ని స‌మాచారం. టెలిఫోటో కెమెరా కింగ్‌గా రియ‌ల్‌మీ జీటీ5 ప్రో ఉంటుంద‌ని చెబుతున్నారు.

రియ‌ల్‌మీ జీటీ5 ప్రో (Realme GT 5 Pro) ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ 2 ఎస్వోసీ (Qualcomm Snapdragon 8 Gen 2 SoC) చిప్‌సెట్‌తో వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌, బీవోఈ ప్యానెల్ (BOE panel), ఒక టిగా బైట్ ఇన్‌బిల్ట్ స్టోరేజీ కెపాసిటీతో వ‌స్తోంది. 50-మెగా పిక్సెల్ 1/1.56 సోనీ ఐఎంఎక్స్ సెన్స‌ర్ (Sony IMX890 Sensor) విత్ ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (Optical Image Stabilisation -OIS) అండ్ ఎల‌క్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (Electronic Image Stabilisation (EIS) స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది.

రియ‌ల్ మీ జీటీ 5 ప్రో (Realme GT 5 Pro) ఫోన్‌ 6.78-అంగుళాల (1,264 x 2,780 పిక్సెల్స్‌) అమోలెడ్ డిస్‌ప్లే, ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్‌తో వ‌స్తున్న‌ది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఉంటుంది. 100 వాట్ల వైర్డ్‌, 50 వాట్ల వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5400 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుంద‌ని తెలుస్తోంది. గ‌త ఆగ‌స్టులో మార్కెట్లోకి రియ‌ల్‌మీ జీటీ5 (Realme GT 5) ఫోన్ 150వాట్ల‌, 240వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ వేరియంట్ల‌లో వ‌స్తుంది. రియ‌ల్‌మీ జీటీ5 ఫోన్ 5,240 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాట‌రీ, త‌ర్వాత 4600 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాట‌రీతో అందుబాటులోకి వ‌చ్చింది. ఫ్లోయింగ్ సిల్వ‌ర్ ఇల్యూష‌న్ మిర్ర‌ర్‌, స్టార్రీ ఒయాసిస్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది.

Tags:    
Advertisement

Similar News