Realme C65 5G | త్వరలో ఎంట్రీ లెవల్ ఫోన్ రియల్‌మీ సీ65 5జీ ఆవిష్కరణ..24న నార్జో 70ఎక్స్ 5జీ కూడా..!
Realme C65 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ (Realme) తన రియల్‌మీ సీ65 5జీ (Realme C65 5G) ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్ బడ్జెట్ లోనే రూ.10 వేల లోపు ధరకే అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.
Realme C65 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ (Realme) తన రియల్‌మీ సీ65 5జీ (Realme C65 5G) ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్ బడ్జెట్ లోనే రూ.10 వేల లోపు ధరకే అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో సెలెక్టెడ్ ఏషియా మార్కెట్లలో ఆవిష్కరించిన రియల్‌మీ సీ65 4జీతో రియల్‌మీ సీ65 5జీ (Realme C65 5G) జత కలుస్తుందని భావిస్తున్నారు. మార్కెట్‌లో ఆవిష్కరిస్తే శరవేగంగా దూసుకెళ్లే ఎంట్రీ లెవల్ 5జీ స్మార్ట్ ఫోన్‌గా రియల్‌మీ సీ65 5జీ ఫోన్ నిలుస్తుందని భావిస్తున్నారు.
రియల్‌మీ సీ65 5జీ (Realme C65 5G) ఫోన్ మూడు ర్యామ్ వేరియంట్ల (4జీబీ, 6జీబీ, 8 జీబీ)లో లభిస్తుంది. వీటి ధరలు రూ.12 వేల నుంచి రూ.15 వేల మధ్య ఉంటాయి. రియల్‌మీ సీ65 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.10 వేలు, మిగతా వేరియంట్ల ధరలు రూ.12,000, రూ.15,000 మధ్య ఉంటాయని తెలుస్తుంది. 12 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్‌గా కూడా ఈ ఫోన్ వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ గ్రీన్, పర్పుల్ రంగుల్లో లభిస్తుంది.
రియల్‌మీ సీ65 4జీ ఫోన్‌లో మాదిరే రియల్‌మీ సీ65 5జీ (Realme C65 5G) ఫోన్‌లో ఫీచర్లు ఉంటాయని తెలుస్తున్నది. మీడియాటెక్ హెలియో జీ85 ఎస్వోసీ, 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీతో కూడిన బ్యాటరీ, 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్స్ సెన్సర్ సెల్ఫీ కెమెరా, 6.67 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. అయితే రియల్‌మీ సీ65 5జీ ఫోన్‌లో మరో ప్రాసెసర్ వినియోగిస్తారని తెలుస్తున్నది.
24న రియల్‌మీ నార్జో 70ఎక్స్ ఆవిష్కరణ
ఇదిలా ఉండగా, ఈ నెల 24 మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ (Realme Narzo 70x 5G) ఫోన్ వచ్చేవారం బారత్ మార్కెట్‌లో ఆవిష్కరించడానికి రంగం సిద్ధమైంది. గతేడాది భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించిన రియల్‌మీ నార్జో 60ఎక్స్ 5జీ ఫోన్ కొనసాగింపుగా రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ వస్తోంది. 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో కూడిన బ్యాటరీ ఉంటుంది. దీని ధర రూ.12 వేల లోపే అందుబాటులో ఉంటుందని తెలుస్తున్నది.