Realme 12 Pro 5G | పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో రియ‌ల్‌మీ12 ప్రో 5జీ సిరీస్ ఫోన్లు.. ఆవిష్క‌ర‌ణ తేదీ ఇదే..!

Realme 12 Pro 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ రియ‌ల్‌మీ (Realme) త‌న రియ‌ల్‌మీ 12 ప్రో (Realme 12 Pro) 5జీ ఫోన్ల‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించేందుకు ముహూర్తం ఖ‌రారు చేసింది.

Advertisement
Update:2024-01-16 13:26 IST

Realme 12 Pro 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ రియ‌ల్‌మీ (Realme) త‌న రియ‌ల్‌మీ 12 ప్రో (Realme 12 Pro) 5జీ ఫోన్ల‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించేందుకు ముహూర్తం ఖ‌రారు చేసింది. ఈ సిరీస్‌లో రియ‌ల్‌మీ 12ప్రో (Realme 12 Pro) తోపాటు రియ‌ల్‌మీ 12 ప్రో+ (Realme 12 Pro+) వేరియంట్ కూడా వ‌స్తోంది. ఈ నెల 29 మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఈ ఫోన్ల‌ను రియ‌ల్‌మీ (Realme) భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించ‌నున్న‌ది. వీటిలో రియ‌ల్‌మీ12 ప్రో+ (Realme 12 Pro+) ఫోన్‌ పెరిస్కోప్ టెలిఫోన్ కెమెరా (Periscope Telephoto Camera) తో వ‌స్తుంద‌ని తెలుస్తోంది. షియోమీ (Xiaomi) అనుబంధ రెడ్‌మీ నోట్ 13ప్రో (Redmi Note 13 Pro), రెడ్‌మీ 13 ప్రో+ (Redmi Note 13 Pro +) ఫోన్ల‌కు రియ‌ల్‌మీ 12 ప్రో (Realme 12 Pro 5G), రియ‌ల్‌మీ 12 ప్రో + (Realme 12 Pro+ 5G) ఫోన్లు గ‌ట్టి పోటీ ఇస్తాయ‌ని తెలుస్తున్న‌ది.

రియ‌ల్‌మీ 12ప్రో 5జీ (Realme 12 Pro 5G) ఫోన్లు బ్యాక్ ప్యానెల్ టాప్‌పై సెంట్ర‌ల్‌లో గోల్డెన్ డ‌య‌ల్‌తోపాటు స‌ర్క్యుల‌ర్ కెమెరా మాడ్యూల్ క‌లిగి ఉంటాయి. ఈ ఫోన్లు నేవీగేట‌ర్ బైగ్‌, స‌బ్‌మెరైన్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో వ‌స్తుంద‌ని స‌మాచారం. రియ‌ల్‌మీ12ప్రో+ ఫోన్ అద‌నంగా ఎక్స్‌ప్లోర‌ర్ రెడ్ సేడ్ క‌లర్‌లో రానున్న‌ది. రెండు ఫోన్లూ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ల‌లో అందుబాటులోకి వ‌స్తాయ‌ని చెబుతున్నారు.

రియ‌ల్‌మీ12 ప్రో (The Realme 12 Pro) సిరీస్ ఫోన్లు ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐస్‌) మ‌ద్ద‌తుతో 50- మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 890 సెన్స‌ర్ (50-megapixel Sony IMX890 sensor) మెయిన్ కెమెరా క‌లిగి ఉంటుంది. రియ‌ల్‌మీ12 ప్రో ఫోన్ 32-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా (32-megapixel telephoto camera) విత్ 2ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్ క‌లిగి ఉంటుంది.

ఇక రియ‌ల్‌మీ12 ప్రో+ (Realme 12 Pro+ 5G) ఫోన్ ఓమ్నీ విజ‌న్ ఓవీ64 బీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా విత్ 3ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్ స‌పోర్ట్‌తో వ‌స్తుంద‌ని తెలుస్తోంది. దీంతోపాటు 6ఎక్స్ లాస్‌లెస్ జూమ్‌, 120ఎక్స్ డిజిట‌ల్ జూమ్ ఆప్ష‌న్ కూడా ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం రియ‌ల్‌మీ12ప్రో ఫోన్‌లో 16 మెగాపిక్సెల్‌, రియ‌ల్‌మీ12ప్రో+ ఫోన్‌లో 32-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఉంటాయి.

రియ‌ల్‌మీ 12ప్రో (Realme 12 Pro 5G)ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 6 జెన్ 1 ఎస్వోసీ చిప్‌సెట్‌, రియ‌ల్‌మీ12ప్రో+ (Realme 12 Pro+ 5G) ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ 7ఎస్ జెన్ 2 ఎస్వోసీ చిప్‌సెట్ క‌లిగి ఉంటాయి. రెండు ఫోన్లూ 67వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ క‌లిగి ఉంటాయ‌ని చెబుతున్నారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల క‌ర్వ్డ్ ఎడ్జ్ ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ ప్యానెల్స్ క‌లిగి ఉంటాయి. రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియ‌ల్‌మీ యూఐ5 (Android 14-based Realme UI 5) వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తాయి. రెండు ఫోన్ల‌లో సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్లు ఉంటాయి.

Tags:    
Advertisement

Similar News