Realme 11 5G | 23న భార‌త్ మార్కెట్లోకి రియ‌ల్‌మీ మిడ్ రేంజ్ ఫోన్ రియ‌ల్‌మీ11 5జీ.. ఇవీ డిటైల్స్‌!

Realme 11 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ రియ‌ల్‌మీ త‌న రియ‌ల్‌మీ11 5జీ సిరీస్ ఫోన్ల‌ను ఈ నెల 23న భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించ‌నున్న‌ది.

Advertisement
Update:2023-08-16 12:00 IST

Realme 11 5G | చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ రియ‌ల్‌మీ.. త‌న రియ‌ల్‌మీ11 5జీ (Realme 11 5G) ఫోన్ త్వ‌ర‌లో భార‌త్‌లో ఆవిష్క‌రించ‌నున్న‌ది. రియ‌ల్‌మీ11 5జీ తోపాటు రియ‌ల్‌మీ11ప్రో 5జీ ( Realme 11 Pro 5G), రియ‌ల్‌మీ11ప్రో+ 5జీ ( Realme 11 Pro+ 5G) ఫోన్లు కూడా ఆవిష్క‌రించ‌బోతున్న‌ది. 108-మెగా పిక్సెల్స్ ప్రైమ‌రీ రేర్ హెచ్‌6 సెన్స‌ర్ విత్ ఇన్‌-సెన్సార్ 3ఎక్స్ జూమ్ స‌పోర్ట్‌తో డ్యూయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్ క‌లిగి ఉంటుంది. 2-మెగా పిక్సెల్ పొర్ట్రైట్ సెన్స‌ర్‌తోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్స‌ర్ కెమెరా ఉంటుంద‌ని భావిస్తున్నారు.

రియ‌ల్‌మీ11 5జీ ( Realme 11 5G) ఫోన్ 6.72-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (2400x1080 పిక్సెల్స్‌) డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌, 240 హెర్ట్జ్ ట‌చ్ శాంప్లింగ్ రేట్‌తో వ‌స్తున్న‌ది. ఈ ఫోన్ 8జీబీ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ, 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్లుగా వ‌స్తున్న‌ది. 6ఎన్ఎం మీడియా టెక్ డైమెన్సిటీ 6100+ ఎస్వోసీ చిప్‌సెట్‌తో వ‌స్తుంద‌ని తెలుస్తున్న‌ది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌-13 బేస్డ్ రియ‌ల్‌మీ యూఐ 4.1 ఔటాఫ్ బాక్స్ వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంద‌ని చెబుతున్నారు.

సెక్యూరిటీ కోసం రియ‌ల్‌మీ11 5జీ ఫోన్ ఇన్‌డిస్‌ప్లే ఫింగ‌ర్‌ప్రింట్ సెన్స‌ర్‌తో వ‌స్తుంది. 5జీ, 4జీ వోల్ట్‌, వై-ఫై, బ్లూ టూత్‌, బైదూ, గాలిలియో, గ్లోనాస్‌, జీపీఎస్‌, యూఎస్బీ టైప్‌-సీ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది. 67వాట్ల సూప‌ర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌తో కూడిన 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుంది. 17 నిమిషాల్లో 50 శాతం, 47 నిమిషాల్లో 100 శాతం బ్యాట‌రీ చార్జింగ్ అవుతుంద‌ని రియ‌ల్‌మీ తెలిపింది.

రియ‌ల్‌మీ11 5జీ ఫోన్ 8జీబీ రామ్ 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ ధ‌ర సుమారు రూ.18 వేలు (1599 చైనా యువాన్లు), 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ దాదాపుగా రూ.20,600 (1799 చైనా యువాన్లు) ప‌లుకుతుంది.

Tags:    
Advertisement

Similar News