Poco X6 Neo | వచ్చేనెలలో పోకో ఎక్స్6 నియో.. జూలైలో పోకో ఎఫ్6.. ఇవీ స్పెషిఫికేషన్స్..?!
పోకో ఎక్స్6 నియో (Poco X6 Neo) ఫోన్ ధర రూ.15 వేల లోపు ఉండొచ్చునని సమాచారం. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్‌సెట్ ఉంటుందని భావిస్తున్నారు.
Poco X6 Neo | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ సబ్ బ్రాండ్ పోకో.. భారత్ మార్కెట్‌లోకి త్వరలో తన పోకో ఎక్స్6 నియో (Poco X6 Neo) ఫోన్ ఆవిష్కరించనున్నది. దీంతోపాటు పోకో ఎక్స్ 6 (Poco X6), పోకో ఎక్స్6 ప్రో (Poco X6 Pro) ఫోన్లను కూడా వచ్చేనెలలో ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ నోట్ 13 ఆర్ ప్రో (Redmi Note 13R Pro) ఫోన్‌ను రీబ్రాండ్ చేసి మార్కెట్లోకి తెస్తున్నట్లు వార్తలొచ్చాయి. వీటితోపాటు ఇప్పటికే బయటకు వచ్చిన పోకో ఎఫ్6 ఫోన్ కూడా జూలైలో భారత్‌లో ఆవిష్కరిస్తుందని తెలుస్తున్నది.
పోకో ఎక్స్6 నియో (Poco X6 Neo) ఫోన్ ధర రూ.15 వేల లోపు ఉండొచ్చునని సమాచారం. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్‌సెట్ ఉంటుందని భావిస్తున్నారు. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కూడా వస్తుంది. డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 రేటెడ్ సర్టిఫికెట్ పొందిన పోకో ఎక్స్6 నియో ఫోన్ 3.5 ఎంఎం ఆడియో జాక్ తో వస్తుందని తెలుస్తున్నది.
రెడ్‌మీ నోట్ 13ఆర్ ప్రో ఫోన్ రీబ్రాండెడ్ వర్షన్‌గా భావిస్తున్న పోకో ఎక్స్6 నియో (Poco X6 Neo) ఫోన్‌లోనూ అవే స్పెషిఫికేషన్స్ ఉంటాయని చెబుతున్నారు. రెడ్‌మీ నోట్ 13 ఆర్ ప్రో (Redmi Note 13R Pro) ఫోన్‌లో 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎంఐయూఐ14 వర్షన్‌పై పని చేస్తుంది. 6.67 అంగుళాల (1080x2400 పిక్సెల్స్) 120 హెర్ట్జ్ ఓలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్‌సెట్, 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కూడా వస్తుంది. రెడ్‌మీ నోట్ 13ఆర్ ప్రో ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.23 వేలు (1999 చైనా యువాన్లు) పలుకుతున్నది. ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లాక్, టైం బ్లూ, మార్నింగ్ లైట్ కలర్ వేస్‌లో లభిస్తుంది.