Poco X6 Neo 5G | 108 మెగా పిక్సెల్స్ కెమెరాతో పోకో ఎక్స్‌6 నియో.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!

Poco X6 Neo 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ పోకో.. బ‌డ్జెట్ ధ‌ర‌లో 108 మెగా పిక్సెల్స్ కెమెరాతో పోకో ఎక్స్‌6 నియో ఫోన్ తీసుకొచ్చింది.

Advertisement
Update:2024-03-14 07:30 IST

Poco X6 Neo 5G | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ పోకో (Poco) త‌న పోకో ఎక్స్‌6 నియో (Poco X6 Neo 5G) ఫోన్‌ను బుధ‌వారం భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.67 అంగుళాల డిస్‌ప్లే, మూడు రంగుల్లో ల‌భిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ (MediaTek Dimensity 6080 SoC) ప్రాసెస‌ర్‌తో న‌డుస్తుంది. రెండు ర్యామ్ అండ్ స్టోరేజీ వేరియంట్ల‌లో అందుబాటులో ఉంటుంది. పోకో ఎక్స్‌6 నియో ((Poco X6 Neo 5G) ఫోన్ 108 మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరా (108-megapixel primary sensor) తో రేర్ డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్ క‌లిగి ఉంటుంది. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తోంది. రెడ్‌మీ నోట్ 13ఆర్ ప్రో ఫోన్‌ను రీబ్రాండ్ చేసి పోకో ఎక్స్‌6 నియో 5జీ ((Poco X6 Neo 5G) ఫోన్ డిజైన్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది.

పోకో ఎక్స్‌6 నియో 5జీ (Poco X6 Neo 5G) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.15,999ల‌కు ల‌భిస్తుంది. టాప్ ఎండ్ వేరియంట్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.17,999ల‌కు అందుబాటులో ఉంది. ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో లిస్టింగ్ ప్ర‌కారం ఆస్ట్ర‌ల్ బ్లాక్, హ‌రిజాన్ బ్లూ, మార్షియ‌న్ ఆరేంజ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ఫోన్ ల‌భిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డులు, ఈఎంఐ ఆప్ష‌న్ల‌తో కొనుగోలు చేస్తే రూ.1000, ఎక్స్చేంజ్ ఆఫ‌ర్ కింద రూ.1000 ధ‌ర త‌గ్గించారు.

పోకో ఎక్స్‌6 నియో 5జీ (Poco X6 Neo 5G) ఫోన్ ఆండ్రాయిడ్ -13 బేస్డ్ ఎంఐయూఐ 14 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. రెండు ప్ర‌ధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌, నాలుగేండ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌, 2160 ట‌చ్ శాంప్లింగ్ రేట్‌, 1920 హెర్ట్జ్ ప‌ల్స్ విడ్త్ మాడ్యులేష‌న్ రేషియోతోపాటు 6.67 అంగుళాల (1,080x2,400 పిక్సెల్స్‌) అమోలెడ్ డిస్‌ప్లేతో వ‌స్తున్న‌ది. 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ క‌లిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ -5 ప్రొటెక్ష‌న్ క‌లిగి ఉంటుంది.

పోకో ఎక్స్‌6 నియో 5జీ (Poco X6 Neo 5G) ఫోన్ 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్ సెట్ క‌లిగి ఉంటుంది. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ క‌లిగి ఉంటుంది. వ‌ర్చువ‌ల్‌గా 24 జీబీ ర్యామ్ వ‌ర‌కూ పెంచుకోవ‌చ్చు. 108- మెగా పిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎం6 ప్రైమ‌రీ కెమెరా విత్ 3x సెన్స‌ర్ జూమ్, 2-మెగా పిక్స‌ల్ సెన్స‌ర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఉంటుంది.

పోకో ఎక్స్‌6 నియో (Poco X6 Neo 5G) ఫోన్ 5జీ, బ్లూ టూత్ 5.3, గ్లోనాస్‌, గెలీలియో, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌, 3.5 ఎంఎం ఆడియో జాక్‌, వై-ఫై 802.11ఏ/బీ/జీ/ ఎన్‌/ ఏసీ, జీపీఎస్‌/ ఏజీపీఎస్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది. యాక్సెల‌రో మీట‌ర్‌, యాంబియెంట్ లైట్ సెన్స‌ర్‌, ఈ-కంపాస్‌, గైరో స్కోప్‌, ఐఆర్ బ్లాస్ట‌ర్, ప్రాగ్జిమిటీ సెన్స‌ర్ త‌దిత‌ర సెన్స‌ర్లు ఉన్నాయి. బ‌యో మెట్రిక్ అథంటికేష‌న్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్‌, ఏఐ బ్యాక్డ్ ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్, సింగిల్ స్పీక‌ర్ విత్ డోల్బీ ఆట్మోస్ మ‌ద్ద‌తు క‌లిగి ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News