పోకో నుంచి బడ్జెట్ పెర్ఫామెన్స్ ఫోన్! ఫీచర్లివే..
పోకో నుంచి ‘పోకో సీ61’ పేరుతో బడ్జెట్ మొబైల్ లాంచ్ అయింది. ఇది మీడియాటెక్ హెలియో జీ36 ఎస్వోసీ ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.
షావోమీకి చెందిన సబ్ బ్రాండ్ పోకో.. ఎక్కువగా పెర్ఫామెన్స్, గేమింగ్‌లపై ఫోకస్ చేస్తుంది. అయితే తాజాగా పదివేలలోపు బడ్జెట్‌లో ఓ ఫోన్ లాంఛ్ చేసింది. దీని ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే..
పోకో నుంచి ‘పోకో సీ61’ పేరుతో బడ్జెట్ మొబైల్ లాంచ్ అయింది. ఇది మీడియాటెక్ హెలియో జీ36 ఎస్వోసీ ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌పై రన్ అవుతుంది. ఇందులో 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే 6.71 అంగుళాల హెచ్ డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఇది గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది.
కెమెరాల విషయానికొస్తే.. పోకో సీ61 ఫోన్‌లో 8-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు 0.08 ఎంపీ డెప్త్ సెన్సర్ ఉంది. సెల్ఫీల కోసం 5 -మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.
ఇక వీటితోపాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, డ్యుయల్ నానో సిమ్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 5.3, వైఫై 802.1, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,499, 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,499 గా ఉన్నాయి. రోజువారీ యూసేజ్‌కు ఈ మొబైల్ బాగుంటుంది. గేమింగ్‌కు సపోర్ట్ చేయదు. బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.