Oppo Find N3 Flip | భారత్ మార్కెట్‌లోకి క్లామ్‌షెల్ స్టైల్ ఫోల్డబుల్ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Oppo Find N3 Flip | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo).. భారత్ మార్కెట్‌లోకి తన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ (Oppo Find N3 Flip) ఫోన్ గురువారం ఆవిష్కరించింది.
Oppo Find N3 Flip | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo).. భారత్ మార్కెట్‌లోకి తన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ (Oppo Find N3 Flip) ఫోన్ గురువారం ఆవిష్కరించింది. లేటెస్ట్ క్లామ్‌షెల్-స్టైల్ ఫోల్డబుల్ (clamshell-style foldable) ఫోన్ ఇది. మీడియాటెక్ ఒక్టాకోర్ డైమెన్సిటీ 9200 చిప్‌సెట్ (MediaTek's octa-core Dimensity 9200 chipset), 12 జీబీ ర్యామ్, 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. మూడు రంగుల్లో లభిస్తుందీ ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ ఫోన్ (Oppo Find N3 Flip). 3.26 అంగుళాల కవర్ డిస్‌ప్లే, 6.80 అంగుళాల ఇన్నర్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాతో వస్తుంది.
భారత్‌లో ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ ధర ఇలా
12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ రామ్ కెపాసిటీతో వస్తున్న ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ (Oppo Find N3 Flip) ఫోన్ రూ.94,999లకు లభిస్తుంది. క్రీమ్ గోల్డ్, మిస్టీ పింక్, స్లీక్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తోంది. ఒప్పో ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్స్ ప్రారంభం అవుతాయి. ఈ నెల 22 సాయంత్రం ఆరు గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్లలో లభ్యం అవుతుంది. రూ.12 వేల విలువైన క్యాస్ బ్యాక్ ఆఫర్లతోపాటు ఒప్పో ఫోన్ యూజర్లకు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.8,000 అదనపు రాయితీ పొందొచ్చు.
ఈ ఏడాది ప్రారంభంలో ఒప్పో (Oppo) భారత్ మార్కెట్‌లో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ (Oppo Find N2 Flip) ఫోన్ ఆవిష్కరించింది. 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.89,999 లకే లభిస్తుంది. తాజాగా మార్కెట్లోకి వచ్చిన ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ (Oppo Find N3 Flip) ఫోన్.. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్5 (Samsung Galaxy Z Flip 5), మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా (Motorola Razr 40 Ultra) ఫోన్లకు గట్టి పోటీ ఇస్తుంది.
ఇవీ ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ స్పెషిఫికేషన్స్.. ఫీచర్లు..
ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ (Oppo Find N3 Flip) ఫోన్ డ్యుయల్ సిమ్ (నానో + ఈ-సిమ్) కలిగి ఉండటంతోపాటు ఆండ్రాయిడ్ 13 విత్ ఒప్పో కలర్ ఓఎస్ 13.2 స్కిన్ ఆన్ టాప్ (Android 13 with Oppo's ColorOS 13.2 skin on top) వర్షన్‌పై పని చేస్తుంది. ఈ ఫోన్ 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ (1,080x2,520 పిక్సెల్స్) రిజొల్యూషన్, 1 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ డైనమిక్ రీఫ్రెష్ రేట్‌తోపాటు ఎల్టీపీఓ అమోలెడ్ (LTPO AMOLED inner screen) కలిగి ఉంటుంది. దీని పీక్ బ్రైట్‌నెస్ 1600 నిట్స్ ఉంటుంది. 3.26-అంగుళాల (382x720 పిక్సెల్స్) కవర్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. కవర్ డిస్‌ప్లే అమోలెడ్ ప్యానెల్ విత్ 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో వస్తుంది.
ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ (Oppo Find N3 Flip) ఫోన్.. ఏఆర్ఎం ఇమ్మోర్టైల్స్-జీ715 ఎంసీ11 జీపీయూతోపాటు 4 ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్ సెట్ కలిగి ఉంటది. ఈ ఫోన్ 12 జీబీ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంటుంది. అయితే చైనాలో విడుదల చేసిన 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్.. భారత్ మార్కెట్‌లో లభించదు.
కెమెరా సెటప్ ఇలా
ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తోపాటు భారత్ మార్కెట్లోకి వస్తున్న తొలి క్లామ్‌షెల్ స్టైల్ (clamshell-style foldable) ఫోల్డబుల్ ఫోన్ ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ ఫోన్ (Oppo Find N3 Flip). 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సర్ (Sony IMX890 sensor) అండ్ ఎఫ్/1.8 అపెర్చర్ కెమెరా, సోనీ ఐఎంఎక్స్ 581 సెన్సర్ (Sony IMX581 sensor) అండ్ ఎఫ్/2.2 అపెర్చర్ తోపాటు 48-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, ఎఫ్/2.0 అపెర్చర్ ప్లస్ సోనీ ఐఎంఎక్స్ 709 సెన్సర్ (Sony IMX709 sensor)తో కూడిన 32-మెగా పిక్సెల్ టెలిఫొటో కెమెరా
సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ (Oppo Find N3 Flip) ఫోన్ ఇన్నర్ స్క్రీన్‌లో సోనీ ఐఎంఎక్స్ 709 ఆర్జీబీడబ్ల్యూ సెన్సర్ ప్లస్ ఎఫ్/2.4 అపెర్చర్‌తోపాటు 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా లభిస్తుంది. ఈ ఫోన్ డోల్బీ అట్మోస్‌తోపాటు డ్యుయల్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది.
ఇవీ కనెక్టివిటీ ఆప్షన్లు..
ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ (Oppo Find N3 Flip) ఫోన్ 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 7, బ్లూ టూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటది. ప్రాగ్జిమిటీ సెన్సర్, యాక్సిలోమీటర్, గైరో స్కోప్, గ్రావిటీ సెన్సర్, అంబియెంట్ లైట్ సెన్సర్, కంపాస్ ఉంటాయి. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. 44వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 4300 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది.