స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో ఒప్పో కొత్త ఫోన్! ఫీచర్లివే..

ఒప్పో నుంచి ‘ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్( OPPO F27 Pro+)’ పేరుతో ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త 5జీ మొబైల్ లాంచ్ అయింది.

Advertisement
Update:2024-06-15 19:15 IST

పాపులర్ మొబైల్ బ్రాండ్ ఒప్పో సరికొత్త బిల్డ్ క్వాలిటీ టెక్నాలజీతో కొత్త ఫోన్‌ను లాంఛ్ చేసింది. మిడ్ రేంజ్ బడ్జెట్లో వస్తున్న ఈ మొబైల్ ధర, ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే.

ఒప్పో నుంచి ‘ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్( OPPO F27 Pro+)’ పేరుతో ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త 5జీ మొబైల్ లాంచ్ అయింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ బేస్డ్ కలర్ ఓఎస్‌పై రన్ అవుతుంది. ఈ

ఒప్పో ఎఫ్27ప్రో ప్లస్ 5జీ ఫోన్ లో 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. త్రీడీ కర్వ్‌డ్ ఓఎల్ఈడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. 240హెర్ట్జ్ వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 950నిట్‌ల వరకు పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. అలాగే ఈ స్క్రీన్.. కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో వస్తుంది.

ఇక ఈ మొబైల్ కెమెరాల విషయానికొస్తే.. ఇందులో 64ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2ఎంపీ సెకండరీ సెన్సార్‌ ఉంటుంది. అలాగే ముందువైపు 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. డ్యుయల్ వీడియో రికార్డింగ్, హెచ్‌డీఆర్ మోడ్ వంటి ఫీచర్లున్నాయి.

ఒప్పో ఎఫ్27ప్రో ప్లస్ 5జీ ఫోన్‌లో 67 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీంతోపాటు ఇందులో సరికొత్త వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్, గ్లూ ప్రూఫ్ ప్రొటెక్షన్ ఫీచర్లున్నాయి. అలాగే 360 డిగ్రీల ఆర్మర్ బాడీ డిజైన్‌, 5 స్టార్స్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో ఈ మొబైల్ వస్తుంది. ఫోన్ కింద పడినా పెద్దగా దెబ్బతినకుండా ఈ డిజైన్ కాపాడుతుంది.

ఒప్పో ఎఫ్27ప్రో ప్లస్ 5జీ ఫోన్‌లో ఐపీ69, ఐపీ68, ఐపీ66 రేటింగ్‌లతో పాటు ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌, వై-ఫై 6, జీపీఎస్, బ్లూటూత్ 5.3, యూఎఫ్‌ఎస్ 3.1 స్టోరేజీ వంటి ఫీచర్లున్నాయి. ధరల విషయానికొస్తే.. 8జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ. 27,999, 8జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ. 29,999 గా ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News