Oppo A3 Pro 5G | ఒప్పో మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఏ3 ప్రో.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!

Oppo A3 Pro 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) త‌న మిడ్ బ‌డ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఏ3 ప్రో 5జీ (Oppo A3 Pro 5G)ను భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది.

Advertisement
Update: 2024-06-24 06:43 GMT

Oppo A3 Pro 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) త‌న మిడ్ బ‌డ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఏ3 ప్రో 5జీ (Oppo A3 Pro 5G)ను భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది. 50-మెగా పిక్సెల్స్ మెయిన్ సెన్స‌ర్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 (MediaTek Dimensity 6300) ప్రాసెస‌ర్‌, 45వాట్ల సూప‌ర్ వూక్ (SuperVOOC) చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5100 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ క‌లిగి ఉంటుంది. ఒప్పో ఏ3 ప్రో 5జీ (Oppo A3 Pro 5G) ఫోన్‌ను భార‌త్ మార్కెట్లో రెండు వేరియంట్ల‌లో ఆవిష్క‌రించింది. ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఒప్పో ఇండియా వెబ్‌సైట్‌తోపాటు దేశంలోని రిటైల్ స్టోర్ల‌లో ఫోన్ అందుబాటులో ఉంటుంది. మూన్‌లైట్ ప‌ర్పుల్‌, స్టారీ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో సొంతం చేసుకోవ‌చ్చు.

ఒప్పో ఏ3 ప్రో 5జీ (Oppo A3 Pro 5G) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ రూ.17,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999ల‌కు ల‌భిస్తుంది. సెలెక్టెడ్ బ్యాంకు కార్డుల‌పై కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ ల‌భిస్తుంది. వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ (OnePlus Nord CE 3 Lite 5G), వివో వై58 5జీ (Vivo Y58 5G), ఇన్‌ఫినిక్స్ నోట్ 40 5జీ (Infinix Note 40 5G) ఫోన్ల‌కు ఒప్పో ఏ3 ప్రో 5జీ (Oppo A3 Pro 5G) పోటీ ఇస్తుంది.

ఒప్పో ఏ3 ప్రో 5జీ (Oppo A3 Pro 5G) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 180 హెర్ట్జ్ ట‌చ్ శాంప్లింగ్ రేట్‌, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ క‌లిగి ఉంటుంది. స‌న్‌లైట్‌లోనూ ఈ ఫోన్ చేయొచ్చు. ఫోటోగ్ర‌ఫీ కోసం ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తోపాటు డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్ ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరా, ఏఐ లెన్స్ సెకండ‌రీ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఉంటుంది.

ఒప్పో ఏ3 ప్రో 5జీ (Oppo A3 Pro) ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ క‌ల‌ర్ ఓఎస్ వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. 6 నానో మీట‌ర్‌ ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెస‌ర్‌తో ప‌ని చేస్తుంది. 8 జీబీ ర్యామ్ కెపాసిటీతో వ‌స్తున్న ఈ ఫోన్‌లో వ‌ర్చువ‌ల్‌గా 16 జీబీ వ‌ర‌కూ పొడిగించ‌వ‌చ్చు. ఏఐ ఎరేజ‌ర్ ఫంక్ష‌న్‌తోపాటు వాట‌ర్ అండ్ డ‌స్ట్ రెసిస్టెన్‌లో ఐపీ54 స‌ర్టిఫికెట్ క‌లిగి ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News