One Plus 12 Series | వ‌న్‌ప్ల‌స్ నుంచి మ‌రో ప్రీమియం ఫోన్‌.. 23న వ‌న్‌ప్ల‌స్‌12.. వ‌న్‌ప్ల‌స్‌12ఆర్ ఆవిష్క‌ర‌ణ‌.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..?!

One Plus 12 Series | ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ వ‌న్ ప్ల‌స్ (OnePlus) త‌న వ‌న్‌ప్ల‌స్ 12 సిరీస్ ప్రీమియం ఫోన్లు.. వ‌న్‌ప్ల‌స్‌12 (OnePlus 12), వ‌న్‌ప్ల‌స్ 12ఆర్ (OnePlus 12R) ఫోన్ల‌ను భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించేందుకు ముహూర్తం ఖ‌రారైంది.

Advertisement
Update:2024-01-01 11:00 IST

One Plus 12 Series | ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ వ‌న్ ప్ల‌స్ (OnePlus) త‌న వ‌న్‌ప్ల‌స్ 12 సిరీస్ ప్రీమియం ఫోన్లు.. వ‌న్‌ప్ల‌స్‌12 (OnePlus 12), వ‌న్‌ప్ల‌స్ 12ఆర్ (OnePlus 12R) ఫోన్ల‌ను భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించేందుకు ముహూర్తం ఖ‌రారైంది. ఈ నెల 23న `స్మూత్ బియాండ్ బిలీఫ్ (Smooth Beyond Belief) ఈవెంట్ వేదిక‌గా దేశీయ మార్కెట్లోకి వ‌న్‌ప్ల‌స్ 12, వ‌న్‌ప్ల‌స్‌12 ఆర్ ఫోన్లు ఎంట‌ర్ కానున్నాయి. ఇప్ప‌టికే చైనా మార్కెట్లో ల‌భిస్తున్న వ‌న్‌ప్ల‌స్‌12 ఫోన్ స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్‌3 ఎస్వోసీ చిప్‌సెట్ క‌లిగి ఉంటుంది. 100 వాట్ల వైర్డ్ సూప‌ర్ వూక్ చార్జింగ్, 50 వాట్ల వైర్‌లెస్ చార్జింగ్‌, 10వాట్ల రివ‌ర్స్ వైర్‌లెస్ చార్జింగ్‌ మద్ద‌తుతో 5400 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తోంది.

వ‌న్‌ప్ల‌స్‌12 (OnePlus 12) ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్‌, 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్‌గా వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. ఫ్ల‌వీ ఎమ‌రాల్డ్‌, సిల్కీ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంద‌ని తెలుస్తోంది. ఇక వ‌న్‌ప్ల‌స్‌12 ఆర్ (OnePlus 12R) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్‌, 16జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్‌గా రానున్నది. వ‌న్‌ప్ల‌స్ 12ఆర్ ఫోన్ కూల్ బ్లూ, ఐర‌న్ గ్రే షేడ్స్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది.

గ‌త నెల ప్రారంభంలో చైనాలో ఆవిష్క‌రించిన వ‌న్‌ప్ల‌స్‌12 (OnePlus 12) ఫోన్ ధ‌ర సుమారు రూ.50,700 (4299 చైనా యువాన్లు) నుంచి ప్రారంభం అవుతుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ క‌ల‌ర్ ఓఎస్ 14 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుందీ ఫోన్‌. ఇది 6.82-అంగుళాల క్వాడ్ హెచ్‌డీ+ (1,440 x 3,168 pixels) ఎల్‌టీపీవో ఓలెడ్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ క‌లిగి ఉంటుంది. 4ఎన్ఎం స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ 3 చిప్ సెట్‌తో వ‌స్తున్న ఈ ఫోన్ 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు.

సెల్పీలూ, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌లో 32-మెగా పిక్సెల్ కెమెరా, హెసెల్‌బ్లాడ్ ట్యూన్డ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్ క‌లిగి ఉంటుంది. ట్రిపుల్ రేర్ కెమేరా సెట‌ప్‌లో ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐఎస్‌) మ‌ద్ద‌తుతో 50-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ సెన్స‌ర్ కెమెరా, 32-మెగా పిక్సెల్ టెలిఫొటో సెన్స‌ర్ కెమెరా ఉంటాయి. ఇదిలా ఉంటే వ‌న్‌ప్ల‌స్‌12 (OnePlus 12) కంటే వ‌న్‌ప్ల‌స్ 12 ఆర్ (OnePlus 12R) ఫోన్ చౌక వ‌ర్ష‌న్‌తో వ‌స్తోందని చెబుతున్నారు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ 2 ఎస్వోసీ చిప్‌సెట్‌, 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ క‌లిగి ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News