Ola Electric | స్కూటర్లలో ఐసీఈ ఏజ్‌కు తెర పడిందా.. కొత్త టెక్నాలజీ వచ్చేసిందా.. వచ్చేనెల ఓలా ఎలక్ట్రిక్ న్యూ స్కూటర్!
Ola Electric | ఓలా ఎలక్ట్రిక్.. భవిష్ అగర్వాల్.. పరిచయం అక్కర్లేని పేరు.. పెట్రోల్ ధరాభారం నుంచి తప్పించుకోవడంతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం మొబిలిటీ అంతా ఎలక్ట్రిక్ వైపు మళ్లుతున్న తరుణం ఇది.
Ola Electric | ఓలా ఎలక్ట్రిక్.. భవిష్ అగర్వాల్.. పరిచయం అక్కర్లేని పేరు.. పెట్రోల్ ధరాభారం నుంచి తప్పించుకోవడంతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం మొబిలిటీ అంతా ఎలక్ట్రిక్ వైపు మళ్లుతున్న తరుణం ఇది. ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌లో ఓలా ఎలక్ట్రిక్ పేరొందిన సంస్థ. అనతి కాలంలోనే కస్టమర్ల మనస్సులు చూరగొన్న సంస్థ. ఇంతకుముందే ఓలా ఎలక్ట్రిక్ ఎస్1, ఎస్1 ప్రో స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటితోపాటు ఓలా ఎస్1 ఎయిర్ కూడా ఆవిష్కరించినప్పటికీ మార్కెట్లోకి తీసుకు రాలేదు. మరో ఎలక్ట్రిక్ మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్ ధృవీకరించారు.
ఓలా ఎస్1 ఎయిర్‌తోపాటు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లో ఆవిష్కరిస్తామని ట్వీట్ చేశారు. `జూలైలో మా తదుపరి ప్రొడక్ట్ ఈవెంట్ నిర్వహిస్తున్నాం. #ఎండ్ ఐసీఈ ఏజ్ షో పార్ట్1` అని ట్వీట్ చేశారు. ఎస్ 1, ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్‌లతోపాటు మరో కొత్ ఈవీ స్కూటర్‌తో స్కూటర్ల రంగంలో ఐసీఈ ఏజ్ ముగిసిపోతున్నది. మరో టెక్నాలజీ రాబోతున్నది` అని భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ఆయన తన ట్వీట్‌లో స్కూటర్ హెడ్ ల్యాంప్ పిక్చర్ పోస్ట్ చేశారు.
మార్కెట్‌లోకి వస్తున్న న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆల్ న్యూ టూరర్ స్కూటర్ కానున్నది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న స్కూటర్ కంటే టూరర్ వేరియంట్ స్కూటర్ రాబోతున్నది. ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్‌లో కొత్త విడి భాగాలు జత కలవడంతోపాటు అత్యంత తక్కువ ధరకే అందుబాటులోకి రాబోతున్నది.
రెండేండ్ల క్రితం మార్కెట్లోకి ఎంటరైన ఓలా ఎలక్ట్రిక్ తొలి స్కూటర్ మార్కెట్‌లోకి వదిలినప్పటి నుంచి స్పష్టమైన వృద్ది సాధిస్తూ ముందుకు సాగుతున్నది. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ వద్ద ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో, ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్లు ఉన్నాయి. గత నెలలో 35 వేలకు పైగా స్కూటర్లను విక్రయించింది ఓలా ఎలక్ట్రిక్. ఈవీ టూ వీలర్స్‌కు ఫేమ్-2 కింద సబ్సిడీ తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నెలలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు రికార్డు స్థాయిలో అమ్ముడు కావడం ఆసక్తికర పరిణామం.
సబ్సిడీల సవరణ తర్వాత జూన్ నుంచి ఓలా ఎస్1 ప్రో ధర రూ.1.40 లక్షలు (ఎక్స్ షోరూమ్), ఎస్ 1 స్కూటర్ ధర రూ.1.30 లక్షలు (ఎక్స్ షోరూమ్). రెండు స్కూటర్లపై రూ.15,000 దర పెరిగింది.