Nothing Phone 2 | న‌థింగ్ ఫోన్ 2 ఫోన్ల సేల్స్ ప్రారంభం.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌.. !

ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ న‌థింగ్ ఫోన్‌-2 (Nothing Phone 2) ప్రీమియం ఫోన్‌ సేల్స్ ప్రారంభం అయ్యాయి.

Advertisement
Update:2023-07-21 16:44 IST

Nothing Phone 2 | న‌థింగ్ ఫోన్ 2 ఫోన్ల సేల్స్ ప్రారంభం.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌.. !

Nothing Phone 2 | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ న‌థింగ్ ఫోన్‌-2 (Nothing Phone 2) ప్రీమియం ఫోన్‌ సేల్స్ ప్రారంభం అయ్యాయి. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 8+ జెన్ ఎస్వోసీ చిప్‌సెట్‌ (Qualcomm Snapdragon 8+ Gen 1 SoC)తో వ‌స్తుంది. 4700 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాటరీ విత్ 45 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌, 15 వాట్ల వైర్‌లెస్ చార్జింగ్‌, ఐదు వాట్ల రివ‌ర్స్ చార్జింగ్ స‌పోర్ట్‌తో అందుబాటులోకి వ‌చ్చింది. త్రీ స్టోరేజీ ఆప్ష‌న్లు, రెండు క‌ల‌ర్స్‌లో ల‌భిస్తుంది.

న‌థింగ్ ఫోన్‌-2 (Nothing Phone 2) బేస్ వేరియంట్ 8 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ.44,999, 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ.49,999, 12 జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ.54,999 ల‌కు ల‌భిస్తాయి. డార్క్ గ్రే, వైట్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో అందుబాటులో ఉంటుంది. ఈ-కామ‌ర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు దేశంలోని సెలెక్టెడ్ రిటైల్ స్టోర్ల‌లో ల‌భిస్తుంది.

యాక్సిస్ బ్యాంక్‌, సిటీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల‌పై రూ.44,999-49,999 ధ‌ర‌ల మ‌ధ్య‌ కొనుగోలు చేస్తే రూ.3000 ఫ్లాట్ డిస్కౌంట్ ల‌భిస్తుంది. న‌థింగ్ ఫోన్‌-2తోపాటు న‌థింగ్ ఇయ‌ర్ స్టిక్ (Nothing Ear Stick) కొనుగోలు చేస్తేడిస్కౌంట్ ధ‌ర‌కు రూ.4250ల‌కే ఆడియో యాక్సెస‌రీ పొంద‌వ‌చ్చు.

6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + (1,080x2,412 పిక్సెల్స్‌) ఎల్‌పీటీఓ ఓలెడ్ డిస్‌ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌, ట‌చ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్, ఎస్‌జీఎస్ బ్లూ లైట్‌, హెచ్‌డీఆర్‌10+ స‌ర్టిఫికేష‌న్స్‌తో వ‌స్తున్న‌ది న‌థింగ్ ఫోన్‌-2. ఈ ఫోన్ 4ఎన్ఎం క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 8+ జెన్ 1 ఎస్వోసీ చిప్‌సెట్ విత్ అడ్రెనో 730 జీపీయూ క‌లిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ న‌థింగ్ ఓఎస్ 2.0 వ‌ర్ష‌న్ మీద ప‌ని చేస్తుంది.

న‌థింగ్ ఫోన్‌-2 (Nothing Phone 2) డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్‌తో వ‌స్తున్న‌ది. 50-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ కెమెరా విత్ 1/1.56 అంగుళాల సోనీ ఐఎంఎక్స్ 890 ప్రైమ‌రీ సెన్స‌ర్ విత్ బాథ్ ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐఎస్‌) అండ్ ఎల‌క్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఈఐఎస్‌) స‌పోర్ట్, 50-మెగా పిక్సెల్ సెన్స‌ర్ విత్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 1/2.76-అంగుళాల శాంసంగ్ జేఎన్‌1 సెన్స‌ర్ విత్ ఈఐఎస్ క‌లిగి ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 1/2.74 - అంగుళాల సోనీ ఐఎంఎక్స్ 615 సెన్స‌ర్ క‌లిగి ఉంటుంది.

న‌థింగ్ ఫోన్‌-2 4700 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ విత్ 45 వాట్ల పీపీఎస్ వైర్డ్‌, 15 వాట్ల క్యూఐ వైర్‌లెస్‌, 5వాట్ల వైర్‌లెస్ రిజ‌ర్వ్ చార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. ఈ ఫోన్ వై-ఫై6, 5జీ, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్‌/ఏజీపీఎస్ నేవీ సీ, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News