కొత్త బ్రాండ్‌తో నోకియా రీఎంట్రీ! రాబోయే ఫోన్ల వివరాలివే..

నోకియా హెచ్ఎండీ అనే బ్రాండ్‌ పేరుతో కొన్ని కొత్త మొబైల్స్ ను యూరోపియన్ మార్కెట్లో లాంఛ్ చేసింది. త్వరలోనే ఈ మొబైళ్లు ఇండియాలోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.

Advertisement
Update:2024-04-27 12:15 IST

ప్రముఖ మొబైల్ బ్రాండ్ నోకియా.. గత కొంతకాలంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను నిలిపివేసింది. అయితే ఇప్పుడీ బ్రాండ్.. ‘హెచ్​ఎండీ’ పేరుతో మార్కెట్లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ బ్రాండ్‌నేమ్‌తో రిలీజవుతున్న మొబైళ్ల వివరాలు కూడా ప్రకటించింది.

నోకియా హెచ్ఎండీ అనే బ్రాండ్‌ పేరుతో కొన్ని కొత్త మొబైల్స్ ను యూరోపియన్ మార్కెట్లో లాంఛ్ చేసింది. త్వరలోనే ఈ మొబైళ్లు ఇండియాలోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ‘హెచ్‌ఎండీ పల్స్’, ‘హెచ్‌ఎండీ పల్స్ ప్లస్’, ‘హెచ్ఎండీ పల్స్ ప్రో’, ‘హెచ్ఎండీ వైబ్’ పేర్లతో రానున్న ఈ మొబైల్స్ ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే..

హెచ్​ఎం​డీ పల్స్ ఫోన్.. యునిసాక్ టీ 606 ప్రాసెసర్ పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై రన్ అవుతుంది. 6.65 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. 13 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతోపాటు 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ 5000 ఎంఏహెచ్ ఉంటుంది. 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 12,420 ఉంటుంది.

హెచ్​ఎం​డీ పల్స్ ప్లస్ ఫీచర్లు

హెచ్​ఎం​డీ పల్స్ ప్లస్.. యునిసాక్ టీ 606 ప్రాసెసర్ పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై రన్ అవుతుంది. 6.65 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతోపాటు 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ 5000 ఎంఏహెచ్ ఉంటుంది. 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బేస్ వేరియంట్ ధర సుమారు రూ. రూ.14,200 ఉంటుంది.

హెచ్​ఎండీ పల్స్ ప్రో ఫీచర్లు

హెచ్​ఎం​డీ పల్స్ ప్రో.. యునిసాక్ టీ 606 ప్రాసెసర్ పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై రన్ అవుతుంది. 6.65 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సర్‌‌తోపాటు 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ 5000 ఎంఏహెచ్ ఉంటుంది. 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బేస్ వేరియంట్ ధర సుమారు రూ. రూ.16,000 ఉంటుంది.

హెచ్​ఎం​డీ వైబ్.. స్నాప్ డ్రాగర్ 680 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై రన్ అవుతుంది. 6.56 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. 13 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతోపాటు 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ 4000 ఎంఏహెచ్ ఉంటుంది. 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బేస్ వేరియంట్ ధర సుమారు రూ. రూ.13,000 ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News