ఇన్‌స్టాగ్రామ్‌లో రాబోతున్న కొత్త ఫీచర్లు!

ఈ తరం యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్న సోషల్ మీడియా యాప్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ ముందుంది.

Advertisement
Update:2023-10-29 12:09 IST

ఇన్‌స్టాగ్రామ్‌లో రాబోతున్న కొత్త ఫీచర్లు!

ఈ తరం యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్న సోషల్ మీడియా యాప్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ ముందుంది. అయితే యూత్‌ను ఆకర్షించేందుకు ఇన్‌స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. త్వరలోనే ఇన్‌స్టాలో కొన్ని కీలక అప్‌డేట్స్ రానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఇన్‌స్టాగ్రామ్‌లో గతేడాది ‘నోట్స్‌’ అనే ఫీచర్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నోట్స్‌తో టెక్స్ట్‌, ఎమోజీలతో కూడిన పోస్ట్‌ను అప్‌లోడ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు నోట్స్‌ సెక్షన్‌లో ఆడియో మెసేజ్‌లు, షార్ట్ వీడియోలు కూడా జత చేసే ఫీచర్‌‌ను తీసుకోస్తోంది ఇన్‌స్టా. వీడియో, ఆడియో రికార్డు చేసి నోట్‌గా పోస్ట్ చేసుకోవచ్చు. నోట్స్ సెక్షన్.. డీఎం లిస్ట్‌లో అన్నింటికంటే పైన కనిపిస్తుంది. అంతేకాదు, నోట్స్‌కు లొకేషన్‌ను కూడా ట్యాగ్‌ చేయొచ్చు. ట్యాగ్‌ చేసిన లొకేషన్‌ కూడా నోట్స్‌లో టెక్స్ట్‌ మీద కనిపిస్తుంది. నోట్స్‌ క్రియేట్ చేసేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం ట్యాబ్‌లోకి వెళ్లి ‘యువర్‌ నోట్‌’పై క్లిక్‌ చేయాలి. అక్కడ నోట్స్ రాసి పోస్ట్‌ చేస్తే.. 24 గంటల వరకూ లైవ్‌గా ఉంటుంది.

ఫేస్‌బుక్‌లో మాదిరిగా ఇన్‌స్టాలో కూడా ఫ్రెండ్స్ బర్త్ డేలకు రిమైండర్లు ఇచ్చే ఫీచర్‌‌ త్వరలోనే అందుబాటులోకి రానుంది . ఈ ఫీచర్.. ఫాలోవర్లకు, ఫ్రెండ్స్‌కు పుట్టిన తేదీని గుర్తుచేస్తుంది. ఆయా డేట్స్ వచ్చినప్పుడు విషెస్ పంపేందుకు వీలుగా కొన్ని ప్రీ డిజైన్డ్ రీల్స్, పోస్ట్ వంటి వాటిపై కూడా ఇన్‌స్టాగ్రామ్ పని చేస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘క్లోజ్‌ ఫ్రెండ్స్‌’తో స్టోరీస్ షేర్‌ చేసుకునే ఫీచర్ ఇప్పటికే ఉంది. అయితే ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్‌తో పాటు మరికొన్ని లిస్ట్‌లను కూడా తయారుచేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది ఇన్‌స్టాగ్రామ్. క్లోజ్ ఫ్రెండ్స్ మాదిరిగానే.. ఫ్యామిలీ లేదా ఆఫీస్.. ఇలా నచ్చిన లిస్ట్‌ను రెడీ చేసుకుని కేవలం వాళ్ల వరకూ మాత్రమే స్టోరీ కనిపించేలా పోస్ట్ చేయొచ్చు.

Tags:    
Advertisement

Similar News