అతి పలుచని డిజైన్‌తో మోటో ఎడ్జ్ 50! స్పెసిఫికేషన్లు ఇవే..

ప్రముఖ మొబైల్ బ్రాండ్ మోటొరోలా రీసెంట్‌గా ‘మోటో ఎడ్జ్‌ 50’ పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. ఇది ప్రపంచంలోనే అతి పలుచని మొబైల్ అని మోటో ప్రకటిస్తోంది.

Advertisement
Update:2024-08-06 17:15 IST

ప్రముఖ మొబైల్ బ్రాండ్ మోటొరోలా రీసెంట్‌గా ‘మోటో ఎడ్జ్‌ 50’ పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. ఇది ప్రపంచంలోనే అతి పలుచని మొబైల్ అని మోటో ప్రకటిస్తోంది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

మోటో నుంచి లాంఛ్ అయిన ‘మోటొరోలా ఎడ్జ్ 50(Motorola Edge 50)’ ప్రపంచంలోనే స్లిమ్మెస్ట్ ఫోన్. ఈ మొబైల్ కేవలం 7.79 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉంటుంది. ఈ ఫోన్ ధర, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మోటో ఎడ్జ్ 50 మొబైల్ క్వాల్‌కామ్‌ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 బేస్డ్ ‘హలో యూఐ’పై రన్ అవుతుంది. ఇందులో 6.67 అంగుళాల పీఓఎల్‌ఈడీ త్రీడీ కర్వ్‌డ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుని సపోర్ట్ చేస్తుంది. 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. స్క్రీన్ కు కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్ ఉంది.

మోటో ఎడ్జ్ 50 లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 13 ఎంపీ అల్ట్రా వైడ్‌ సెన్సర్, 10 ఎంపీ టెలిఫోటో సెన్సర్, ముందువైపు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇందులో 68 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్, 15 వాట్ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది.

ఇకపోతే మోటో ఎడ్జ్ 50 లో డాల్బీ అట్మాస్‌ స్పీకర్లు, ఐపీ 68 వాటర్ రెసిస్టెన్స్, డ్యుయల్ నానో సిమ్, 5జీ కనెక్టివిటీ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎఫ్ ఎస్ 2.2 స్టోరేజీ, హెచ్‌డీఆర్ 10 సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బేస్ వేరియంట్( 8జీబీ+256 జీబీ) ధర రూ. 27,999గా ఉంది. జంగిల్ గ్రీన్, పీచ్ ఫజ్, కోలా గ్రే వంటి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News