వాట్సాప్‌లో ఏఐ చాట్ బాట్ ఫీచర్లు! ఎలా పొందాలంటే..

వాట్సప్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే చాట్ బాట్ ఫీచర్ తాజాగా కొందరి యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.

Advertisement
Update:2024-04-13 06:00 IST

వాట్సప్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే చాట్ బాట్ ఫీచర్ తాజాగా కొందరి యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. చాట్ జీపిటీ మాదిరిగా ఇప్పుడు వాట్సాప్‌లో కూడా యూజర్లు పలు విషయాలను చాట్ ద్వారా అడిగి తెలుసుకోవచ్చు.

వాట్సాప్ యూజర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఏఐ చాట్ బాట్ ఫీచర్ ఇప్పుడు కొంతమంది యూజర్లకు ఎనేబుల్ అయింది. ఇప్పటివరకు ఫ్రెండ్స్‌తో చాటింగ్‌కు మాత్రమే వీలున్న వాట్సాప్‌లో ఇకపై ఏఐతో చాట్ చేస్తూ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు కూడా. ఇదెలా పనిచేస్తుందంటే..

లార్జ్ లాంగ్వేజ్ మోడల్ మెటా ఏఐ టూల్‌ను వాట్సప్‌లో ఇంటిగ్రేట్ చేస్తూ మెటా ఓ కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. అయితే ఇది ఇండియాలోని కొందరి యూజర్లకు మాత్రమే కనిపించి మళ్లీ వెంటనే డిజేబుల్ అయింది. అంటే ప్రస్తుతానికి దీన్ని టెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చాట్‌ మెనూలో మల్టీ కలర్ సర్కులర్ ఐకాన్ ఒకటి కనిపించింది. దానిపై క్లిక్ చేయగానే ‘ఆస్క్‌ మెటా ఏఐ ఎనీథింగ్‌’ అని వస్తుంది. కంటిన్యూ నొక్కితే చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులొ సైన్స్, టెక్నాలజీ, హెల్త్.. ఇలా ఏ టాపిక్ గురించైనా ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందొచ్చు. అలాగే ఈ చాట్ హిస్టరీ పూర్తిగా ఎన్‌క్రిప్టెడ్ అని.. యూజర్ల ప్రైవసీకి ఎలాంటి ముప్పు ఉండదని మెటా చెప్తోంది.

ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన యూజర్ల నుంచి మెటా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోంది. ఆ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తగిన మార్పులు చేసి త్వరలోనే పూర్తిస్థాయిలో ఫీచర్‌‌ను ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది.

ఇకపోతే వాట్సాప్‌లో డౌన్‌లోడ్ చేయకుండానే డాక్యుమెంట్ ఫైల్‌ను చూసే విధంగా ఓ కొత్త ఫీచర్ రాబోతోంది. ఫొటో లేదా వీడియోని డాక్యుమెంట్‌గా పంపినప్పుడు రిసీవర్ దానిని డౌన్‌లోడ్ చేసుకున్నాకే చూసే వీలుంటుంది. అయితే ఇప్పుడా అవసరం లేకుండా నేరుగా ఫైల్‌లో ఉన్న కంటెంట్‌ను చూడొచ్చు. అవసరమనుకుంటేనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫీఛర్ కూడా టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే అందుబాటులోకి వస్తుంది.

Tags:    
Advertisement

Similar News