వాట్సాప్‌లో సరికొత్త లాక్ ఫీచర్లు!
మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో యూజర్ల ప్రైవసీని మెరుగుపరుస్తూ కొన్ని చాట్ లాక్ ఫీచర్లను తీసుకురాబోతుంది. ఇందులో ‘పాస్‌వర్డ్ లెస్ పాస్ కీ’, ‘బ్లాక్ యూజర్స్ ఫ్రమ్ లాక్ స్క్రీన్’ వంటి ఫీచర్లున్నాయి.
మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో యూజర్ల ప్రైవసీని మెరుగుపరుస్తూ కొన్ని చాట్ లాక్ ఫీచర్లను తీసుకురాబోతుంది. ఇందులో ‘పాస్‌వర్డ్ లెస్ పాస్ కీ’, ‘బ్లాక్ యూజర్స్ ఫ్రమ్ లాక్ స్క్రీన్’ వంటి ఫీచర్లున్నాయి. ఇవెలా పని చేస్తాయంటే..
ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త చాట్ లాక్ ఫీచర్లను జత చేయబోతోంది. మొబైల్ నెంబర్, పాస్‌వర్డ్‌కు బదులుగా పాస్‌కోడ్, ఫేస్ ఐడీ, ఫింగర్ ఫ్రింట్ వంటి ఇతర సెక్యూరిటీ ఫీచర్లను జత చేయనుంది. దీంతో యూజర్లు తమ పర్సనల్ చాట్స్‌ను పాస్ కీ, ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ ఐడీలతో కూడా లాక్ చేసుకోవచ్చు. అంతేకాదు యూజర్లు ఒక డివైజ్‌లో చాట్‌ను లాక్ చేసినప్పుడు అది వెబ్, విండోస్, మ్యాక్ వంటిప్లాట్‌ఫారమ్స్‌లో కూడా ఆటోమేటిక్‌గా లాక్ అవుతుంది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. రాబోయే వాట్సాప్ ఆండ్రాయిడ్ 2.24.4.14 అప్‌డేట్‌లో ఇది అందుబాటులోకి రావొచ్చు.
ఇకపోతే లాక్ స్క్రీన్ నుంచే యూజర్లను బ్లాక్ చేసే మరో అదనపు ఫీచర్‌ను కూడా వాట్సాప్ అందుబాటులో ఉంచింది. ఈ ఫీచర్ సాయంతో లాక్ స్క్రీన్ నోటిఫికేషన్ నుంచే స్పామ్ లేదా అనుమానాస్పద వాట్సాప్ చాట్స్‌ను నేరుగా బ్లాక్ చేసేయొచ్చు. ఫిషింగ్ మెసేజ్‌లు ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో వాటికి చెక్ పెట్టేందుకు గానూ ఈ ఫీచర్ తీసుకొచ్చినట్టు వాట్సాప్ చెప్తోంది.
ఇప్పటివరకూ వాట్సాప్‌లో గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే స్పామ్ మెసేజ్‌లను బ్లా్క్ చేసేందుకు చాట్‌ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇకపై ఆ అవసరం లేకుండా బ్లాక్ చేయొచ్చు. ఇకపై లాక్ స్క్రీన్‌పై వాట్సాప్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు రిప్లై బటన్ పక్కనే బ్లాక్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దానిపై నొక్కడం ద్వారా సదరు అకౌంట్‌ను బ్లాక్ చేసేయొచ్చు. ఇక వీటితోపాటు మరికొన్ని ప్రైవసీ, సెక్యూరిటీ ఫీచర్లపై కూడా వాట్సాప్ పనిచేస్తోంది.