సరికొత్త Vo5G టెక్నాలజీ గురించి తెలుసా?

టెలికాం రంగంలో 2జీ నుంచి 5జీ వరకూ రకరకాల టెక్నాలజీలు అప్‌గ్రేడ్ అవుతూ వచ్చాయి.

Advertisement
Update:2023-12-17 23:35 IST

టెలికాం రంగంలో 2జీ నుంచి 5జీ వరకూ రకరకాల టెక్నాలజీలు అప్‌గ్రేడ్ అవుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా ‘వీఓ5జీ(Vo5G)’ అనే కొత్త టెక్నాలజీ పరిచయం అవ్వబోతోంది. దీని ప్రత్యేకతలేంటంటే..

‘వీఓ5జీ’ అంటే ‘వాయిస్ ఓవర్ 5జీ’ అని అర్థం. ఇది కాల్ క్వాలిటీకి సంబంధించిన టెక్నాలజీ. ప్రస్తుతం 4జీ యుగంలో కాల్ క్యాలిటీకి సంబంధించి.. ‘వీఓ ఎల్‌టీఈ(VoLTE)’ అనే టెక్నాలజీ అందుబాటులో ఉంది. అయితే త్వరలోనే ఇది వీఓ5జీగా మారనుంది. దీన్ని ‘వాయిస్‌ ఓవర్‌ న్యూ రేడియో(VoNR)’ అని కూడా అంటున్నారు. వీఓ5జీ అందుబాటులోకి వస్తే.. కాల్‌ డ్రాప్స్‌ అనేవి ఉండవు. ప్రస్తుతం కాల్ డ్రాప్, ఎక్కువ కనెక్షన్ టైం అనేది సమస్యగా ఉంది. వీఓ5జీ వస్తే ఈ సమస్య ఉండదు. ఇది హయ్యర్‌ బ్యాండ్‌విడ్త్‌, తక్కువ లేటెన్సీతో పనిచేస్తుంది. ఇది అధునాతన ఆడియో కోడెక్‌లను ఉపయోగిస్తుంది. దీనివల్ల కాల్‌ క్యాలిటీ గణనీయంగా పెరుగుతుంది. కాల్ చేసిన వెంటనే అవతలివాళ్లకు కనెక్ట్ అవుతుంది. కాల్స్‌లో కనెక్షన్ ఇష్యూస్ ఉండవు. ఇది ఇప్పటికే చాలా దేశాల్లో అందుబాటులో ఉంది. మనదేశంలో 5జీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేసరిగి వీఓ5జీ వచ్చేస్తుంది.

ప్రస్తుతానికి మనం వాడుతున్న 5జీ.. కేవలం ఇంటర్నెట్ సర్వీస్ మాత్రమే. వాయిస్ కాల్స్ ఇప్పటికీ ఎల్‌టీఈ టెక్నాలజీపైనే పనిచేస్తున్నాయి. 5జీ నెట్‌వర్క్‌లో కాల్స్‌ చేయాలంటే వీఓ5జీ రావాల్సిందే. మన దేశంలో వీఓ5జీ ఇంకా అందుబాటులోకి రాలేదు. 5జీ నెట్ వర్క్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాగానే 5జీ ఫోన్స్‌లో డీఫాల్ట్‌గా వీఓ5జీ సపోర్ట్ చేస్తుంది. నెట్‌వర్క్ సిగ్నల్ సింబల్ దగ్గర ‘Vo LTE’ కు బదులు ‘VoNR’ అని కనిపిస్తుంది.

Tags:    
Advertisement

Similar News