Itel S24 | 108-మెగా పిక్సెల్స్ కెమెరాతో కూడిన ఐటెల్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ ఐటెల్ ఎస్24.. రూ.9,999లకే లభ్యం..!
Itel S24 | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ (Itel).. 108-మెగా పిక్సెల్ సెన్సర్ ప్రైమరీ కెమెరాతోపాటు మీడియాటెక్ హెలియో జీ91 ఎస్వోసీ (MediaTek Helio G91 SoC) ప్రాసెసర్‌తో పని చేసే మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ఐటెల్ ఎస్24 (Itel S24) ఆవిష్కరించింది.
Itel S24 | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ (Itel).. 108-మెగా పిక్సెల్ సెన్సర్ ప్రైమరీ కెమెరాతోపాటు మీడియాటెక్ హెలియో జీ91 ఎస్వోసీ (MediaTek Helio G91 SoC) ప్రాసెసర్‌తో పని చేసే మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ఐటెల్ ఎస్24 (Itel S24) ఆవిష్కరించింది. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో ఐటెల్ ఎస్24 (Itel S24) ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. వర్చువల్‌గా ర్యామ్ పెంచుకోవడానికి మెమొరీ ఫ్యూషన్ (Memory Fusion) టెక్నాలజీ జత చేసింది. నోటిఫికేషన్లు తెలిపేందుకు డైమనిక్ బార్ (Dynamic Bar) ఫీచర్ కూడా ఉంది.
ఐటెల్ ఎస్24 (Itel S24 ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,999లకు లభిస్తుంది. ఈ ఫోన్ డాన్ వైట్, స్టారీ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా ఐటెల్ ఎస్24 (Itel S24) ఫోన్ కొనుగోలు చేస్తే రూ.999 విలువైన ఐటెల్42 స్మార్ట్‌వాచ్‌ను ఉచితంగా అందుకోవచ్చు.
ఐటెల్ (Itel S24) ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.6 అంగుళాల హెచ్‌డీ+ (720x1,612 పిక్సెల్స్) స్క్రీన్ కలిగి ఉంటుంది. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీతో వస్తున్న ఐటెల్ ఎస్24 (Itel S24) ఫోన్ మీడియాటెక్ హెలియో జీ91 ఎస్వోసీ (MediaTek Helio G91 SoC) ప్రాసెసర్‌తో వస్తున్నది. ఐటెల్ ఎస్24 (Itel S24) ఫోన్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఈఐఎస్) మద్దతుతో 108-మెగా పిక్సెల్ శాంసంగ్ హెచ్ఎం ఐసోసెల్ సెన్సర్, క్యూవీజీఏ డెప్త్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్స్ సెన్సర్ ఫ్రంట్ కెమెరా ఉంటాయి.
ఐటెల్ ఎస్24 (Itel S24) ఫోన్ డైనమిక్ బార్ (Dynamic Bar) ఫీచర్ కలిగి ఉంటుంది. డైనమిక్ బార్ ఫీచర్ వల్ల ఫ్రంట్ కెమెరా కటౌట్‌పై ఇన్‌కమింగ్ కాల్స్ అలర్ట్స్‌తో కూడిన నోటిఫికేషన్లు వస్తాయి. డ్యుయల్ డీటీఎస్ స్పీకర్లు, బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉంటుంది. వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 4జీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుందీ ఫోన్. 18వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ కలిగి ఉంటుంది. సింగిల్ చార్జింగ్ చేస్తే గేమింగ్ కోసం ఐదు గంటలు, 7.5 గంటల వీడియో వినియోగ సామర్థ్యం ఉంటుంది.