iQoo Z7 Pro 5G | రూ.21,999 నుంచి ఐక్యూ జ‌డ్‌7 ప్రో 5జీ ఫోన్ ప్రారంభం.. ఐదు నుంచి సేల్స్ షురూ..!

iQoo Z7 Pro 5G | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) త‌న ఐక్యూ జ‌డ్‌7 ప్రో 5జీ (iQoo Z7 Pro 5G) ఫోన్ భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది.

Advertisement
Update:2023-09-02 15:57 IST

iQoo Z7 Pro 5G | రూ.21,999 నుంచి ఐక్యూ జ‌డ్‌7 ప్రో 5జీ ఫోన్ ప్రారంభం.. ఐదు నుంచి సేల్స్ షురూ..!

iQoo Z7 Pro 5G | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) త‌న ఐక్యూ జ‌డ్‌7 ప్రో 5జీ (iQoo Z7 Pro 5G) ఫోన్ భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది. రెండు వేరియంట్ల‌లో వ‌స్తున్న‌ది. 8 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్, 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ల‌లో వ‌స్తుంది. రెండు వేరియంట్ల‌పై సెలెక్టెడ్ బ్యాంకు కార్డుల‌పై కొనుగోలు చేస్తే రూ.2000 డిస్కౌంట్ ల‌భిస్తుంది.

ఐక్యూ నిర్ణ‌యించిన ధ‌ర ప్ర‌కారం ఐక్యూ జ‌డ్‌7 ప్రో 5జీ (iQoo Z7 Pro 5G) ఫోన్.. 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ.23,999, 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ.24,999. అంటే 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ రూ.21,999, 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ.22,999ల‌కు ల‌భిస్తుంది.

బ్లూ ల‌గూన్‌, గ్రాఫైట్ మ్యాట్టె క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ఐక్యూ జ‌డ్‌7 ప్రో 5జీ (iQoo Z7 Pro 5G) ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ నెల ఐదో తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి సేల్స్ ప్రారంభిస్తారు. ఈ-కామ‌ర్స్ జెయింట్ అమెజాన్‌, కంపెనీ ఐక్యూ వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోన్ల విక్ర‌యం ప్రారంభం అవుతుంది. ఐక్యూ జ‌డ్‌7ప్రో 5జీ ఫోన్ ఒక్టాకోర్ 4ఎన్ఎం మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ఎస్వోసీ చిప్‌సెట్‌, 66వాట్ల చార్జింగ్ మ‌ద్ద‌తుతో 4600 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫ‌న్ ట‌చ్ ఓఎస్‌13 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది.

6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + (2400 x 1080 పిక్సెల్స్‌) అమోలెడ్ డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. 64-మెగా పిక్సెల్ శాంసంగ్ జీడ‌బ్ల్యూ3 ప్రైమ‌రీ రేర్ సెన్స‌ర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్స‌ర్ విత్ రింగ్ లైక్ ఎల్ఈడీ లైట్‌, సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. సెక్యూరిటీ కోసం ఫింగ‌ర్ ప్రింట్ ఎన్స‌ర్‌, యాక్సెలో మీట‌ర్‌, అంబియెంట్ లైట్ సెన్స‌ర్‌, ప్రాగ్జిమిటీ సెన్స‌ర్‌, గైరోస్కోప్‌, ఈ-కంపాస్ వంటి ఫీచ‌ర్లు ఉంటాయి. 5జీ, 4జీ వోల్ట్‌, వై-ఫై 6, బ్లూ టూత్ 5.3, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News