iPhone 14 | ఐ-ఫోన్ 14పై ఫ్లిప్‌కార్ట్ బంప‌రాఫ‌ర్‌.. డిస్కౌంట్‌పై రూ.56,999ల‌కే ల‌భ్యం..!

iPhone 14 | ఐ-ఫోన్ 15 (iPhone 15 series) సిరీస్ ఫోన్ల‌ను ఆవిష్క‌రించిన ఆరు నెల‌ల త‌ర్వాత ఫిప్ల్‌కార్ట్‌.. ఐ-ఫోన్ 14 ఫోన్ 128 జీబీ స్టోరేజీ ఫోన్ రూ.69,990పై రూ.56,999 ఆఫ‌ర్ అందిస్తుంది.

Advertisement
Update:2024-03-26 13:17 IST

iPhone 14 | గ్లోబ‌ల్ టెక్ దిగ్గ‌జం ఆపిల్ (Apple) త‌న ఐ-ఫోన్ 14 (iPhone 14) సిరీస్ ఫోన్ల‌ను 2022 సెప్టెంబ‌ర్‌లో ఆవిష్క‌రించింది. మార్కెట్‌లో ఆవిష్క‌రించిన‌ప్పుడు ఐ-ఫోన్ 14 (iPhone 14) ఫోన్ రూ.69,900ల‌కు అందుబాటులో ఉంది. ఈ త‌రుణంలో ఐ-ఫోన్ 14 (iPhone 14), ఐ-ఫోన్ 14 ప్ల‌స్ (iPhone 14 Plus) ఫోన్ల‌పై డిస్కౌంట్ ధ‌ర‌ల‌పై ఈ-కామ‌ర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది. సెలెక్ట్ బ్యాంక్ కార్డుల‌పై, ఈఎంఐ లావాదేవీల‌పై అద‌న‌పు డిస్కౌంట్లు అంద‌జేస్తుంది. పాత ఫోన్ల‌పై ఎక్స్చేంజ్ ఆఫ‌ర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్ష‌న్లు అందిస్తున్న‌ది. ఐ-ఫోన్ 14 (iPhone 14), ఐ-ఫోన్ 14 ప్ల‌స్ (iPhone 14 Plus) ఫోన్లు ఆపిల్ ఏ15 బ‌యోనిక్ ఎస్వోసీ (Apple's A15 Bionic SoC) ప్రాసెస‌ర్ల‌పై ప‌ని చేస్తాయి.

ఐ-ఫోన్ 15 (iPhone 15 series) సిరీస్ ఫోన్ల‌ను ఆవిష్క‌రించిన ఆరు నెల‌ల త‌ర్వాత ఫిప్ల్‌కార్ట్‌.. ఐ-ఫోన్ 14 ఫోన్ 128 జీబీ స్టోరేజీ ఫోన్ రూ.69,990పై రూ.56,999 ఆఫ‌ర్ అందిస్తుంది. ఐ-ఫోన్ 14 ఫోన్ 256 జీబీ వేరియంట్ రూ.69,999, 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.86,999ల‌కు అంద‌జేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేసిన వారికి ఐదు శాతం ఆఫ‌ర్ ఇస్తుంది. ప్ర‌తి నెలా రూ.2,004తో ఈఎంఐ ఆప్ష‌న్ ప్రారంభ‌మైంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్‌పై రూ.55,500 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ అందిస్తున్న‌ది.

అలాగే ఐ-ఫోన్ 14 ప్ల‌స్ ఫోన్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.66,999, 256 జీబీ స్టోరేజీ రూ.76,999, 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.96,999ల‌కు సొంతం చేసుకోవ‌చ్చు. ఐసీఐసీఐ డెబిట్ కార్డులు, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల‌తో ఈఎంఐ లావాదేవీల‌పై రూ.2000 వ‌ర‌కూ డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఐ-ఫోన్ 14 ప్ల‌స్ ఫోన్ ధ‌ర రూ.64,999 నుంచి ప్రారంభం అవుతుంది. రూ.2356తో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్ష‌న్ ప్రారంభం అవుతుండ‌గా, పాత ఫోన్ ఎక్స్చేంజ్ కింద రూ.59 వేల వ‌ర‌కూ డిస్కౌంట్ ల‌భిస్తుంది.

ఐ-ఫోన్ 14 (iPhone 14) ఫోన్‌ 6.1‑అంగుళాల సూప‌ర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓలెడ్ (Super Retina XDR OLED) డిస్‌ప్లే, ఐ-ఫోన్ 14 ప్ల‌స్ (iPhone 14 Plus) ఫోన్‌ 6.7‑అంగుళాల సూప‌ర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓలెడ్ (Super Retina XDR OLED) డిస్‌ప్లే క‌లిగి ఉంటాయి. రెండు ఫోన్ల‌లోనూ ఆపిల్ ఏ15 బ‌యోనిక్ ఎస్వోసీ (Apple's A15 Bionic SoC) ప్రాసెస‌ర్ ఉంటుంది.

ఐ-ఫోన్ 14 (iPhone 14), ఐ-ఫోన్ 14 ప్ల‌స్ (iPhone 14 Plus) ఫోన్లు డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్ క‌లిగి ఉంటాయి. 12-మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా (12-megapixel wide-angle camera), 12-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ సెన్స‌ర్ (12-megapixel ultra wide-angle sensor) ఉంటాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 12-మెగా పిక్సెల్ (12-megapixel shooter) సెన్స‌ర్ కెమెరా ఉంటాయి.

Tags:    
Advertisement

Similar News