iPhone 14 | యువ‌తే టార్గెట్‌.. ఐ-ఫోన్ 14పై భారీ డిస్కౌంట్‌.. ఎంతో తెలుసా?!

iPhone 14 | ఆపిల్ ఐ-ఫోన్ (iPhone) అంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు గ‌నుక యువ‌తీయువ‌కుల‌ను ఆక‌ర్షించ‌డానికి గ్లోబ‌ల్ ఐ-ఫోన్ 14 (iPhone 14)పై ఆక‌ర్ష‌ణీయ ఆఫ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది.

Advertisement
Update:2023-06-25 15:13 IST

iPhone 14 | యువ‌తే టార్గెట్‌.. ఐ-ఫోన్ 14పై భారీ డిస్కౌంట్‌.. ఎంతో తెలుసా?!

iPhone 14 | ఆపిల్ ఐ-ఫోన్ (iPhone) అంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు గ‌నుక యువ‌తీయువ‌కుల‌ను ఆక‌ర్షించ‌డానికి గ్లోబ‌ల్ ఐ-ఫోన్ 14 (iPhone 14)పై ఆక‌ర్ష‌ణీయ ఆఫ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. ఈ ఆఫ‌ర్ కింద రూ.35 వేల డిస్కౌంట్ అందిస్తోంది.. ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్ కార్ట్‌. గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో ఐ-ఫోన్ 14 (iPhone 14) మార్కెట్లో ఆవిష్క‌రించింది ఆపిల్‌. తాజాగా మ‌రో మూడు నెల‌ల్లో ఐఫోన్-15 ((iPhone 15) మార్కెట్లోకి తేనున్న నేప‌థ్యంలో ఐ-ఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు ప్ర‌క‌టించిన‌ట్లు తెలుస్తున్న‌ది. అలాగ‌ని ఐఫోన్‌14ని త‌క్కువ అంచ‌నా వేయ‌కండి. మీరు ఆ ఫోన్‌ సొంతం చేసుకుంటే అత్యంత శ‌క్తిమంత‌మైన స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తుంది.

ఐ-ఫోన్ 14 కొనుక్కోవాల‌నుకుంటే ఇదే బెస్ట్ టైం. రిటైల్ స్టోర్లు, ఈ-కామ‌ర్స్ జెయింట్స్ ర‌క‌ర‌కాల డీల్స్‌తో మీ ముందుకు వ‌స్తున్నాయి. రూ.40 వేల లోపు ధ‌ర‌కే ఐ-ఫోన్ 14 సొంతం చేసుకోవాల‌నుకుంటే ఖ‌చ్చితంగా మీరు ఆఫ‌ర్లు అప్ల‌య్ చేస్తే చాలు.

ప్ర‌స్తుతం ఐ-ఫోన్‌14 ఫ్లిప్ కార్ట్‌లో లాంచింగ్ ధ‌ర కంటే రూ.9,901 త‌క్కువ‌గా రూ.69,999 ల‌భిస్తున్న‌ది. ఈఎంఐల లావాదేవీల‌కు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డును వినియోగిస్తే అద‌నంగా రూ.4000 డిస్కౌంట్ పొందొచ్చు. అంటే రూ.65,999ల‌కే ఐ-ఫోన్ 14 సొంతం చేసుకోవ‌చ్చు.

దీనికి అద‌నంగా ఫ్లిప్‌కార్ట్.. మీ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.35 వేల ఎక్స్చేంజ్ డిస్కౌంట్ అందిస్తున్న‌ది. అయితే, పాత స్మార్ట్ ఫోన్ ప‌నితీరును బ‌ట్టి ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఖ‌రారు చేస్తారు. బ్యాంకు ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే న‌మ్మ‌శ‌క్యం కానీ రీతిలో ఐ-ఫోన్ 14 రూ.30,999ల‌కే సొంతం చేసుకోవ‌చ్చు. లాంచింగ్ ధ‌ర‌తో పోలిస్తే ఫ్లిప్ కార్ట్ ద్వారా ఐ-ఫోన్‌14 కొనుగోలు చేస్తే భారీగా రూ.48,901 డిస్కౌంట్ ల‌భిస్తోంది.

ఐ-ఫోన్ 14.. 6.1-అంగుళాల సూప‌ర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓలెడెడ్ డిస్‌ప్లే విత్ స్లిమ్ బెజిల్స్‌, స్ట‌న్నింగ్ విజువ‌ల్ ఎక్స్‌పీరియ‌న్స్‌తో అందుబాటులో ఉంటుంది. హెచ్‌డీఆర్ కంటెంట్‌కు స‌పోర్ట్ చేస్తున్న డిస్ ప్లే.. 1200 నిట్ బ్రైట్ నెస్ క‌లిగి ఉంటుంది. సెక్యూరిటీ, క‌న్వినియెంట్ అన్ లాకింగ్ కోసం ఫేస్ ఐడీ సెన్స‌ర్లు వాడ‌తారు.

ఐ-ఫోన్ 14 ఫోన్ ఏ15 బ‌యోనిక్ చిప్‌, 16 కోర్ న్యూర‌ల్ ప్రాసెసింగ్ యూనిట్‌, 5-కోర్ గ్రాఫిక్ ప్రాసెస‌ర్ క‌లిగి ఉంటుంది. 128 జీబీ, 256 జీబీ, 512 స్టోరేజీ ఆప్ష‌న్ల‌లో అందుబాటులో ఉంటుంది. ఐఓఎస్ 16 వ‌ర్ష‌న్‌పై నిరంత‌రాయ సేవ‌లు ఆఫ‌ర్ చేస్తుంది.

5జీ స‌పోర్ట్‌తోపాటు ఐఫోన్‌-14 బ్లేజింగ్ ఫాస్ట్ ఇంట‌ర్నెట్ స్పీడ్స్‌ను అనుమ‌తిస్తుంది. వై-ఫై, డ్యూయ‌ల్ సిమ్స్‌, బ్లూ టూత్‌, జీపీఎస్‌, చార్జింగ్ అండ్ డేటా ట్రాన్స్‌ఫ‌ర్ కోసం లైటెనింగ్ పోర్ట్ క‌లిగి ఉంటుంది. ఐఫోన్ 14 డ్యుయ‌ల్ కెమెరా సెట‌ప్ క‌లిగి ఉంటుంది. ప్రైమ‌రీ కెమెరా 12మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్స‌ర్ విత్ లార్జ‌ర్ ఎఫ్‌/1.5 అపెర్చ‌ర్‌, సెన్స‌ర్ షిప్ట్ ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐఎస్‌), లైటింగ్ ప‌రిస్థితుల‌కు స‌వాళ్లు విసురుతూ యూజ‌ర్ల‌కు క్లియ‌ర్ అండ్ షార్ప్ ఫోటోలు అందిస్తుంది. వైడ్ యాంగ్ షాట్స్ షూట్ చేయడానికి 12-మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ షూట‌ర్ క‌లిగి ఉంటుంది. ఇది వీడియో రికార్డింగ్ కోసం డాల్బీ విజ‌న్‌కు స‌పోర్ట్ చేస్తుంది. హైక్వాలిటీ వీడియోలు రికార్డు చేయొచ్చు.

Tags:    
Advertisement

Similar News