ఇన్‌స్టాగ్రామ్‌లో క్వై్ట్ మోడ్! ఎలా పనికొస్తుందంటే..

Instagram Quiet mode: సోషల్ మీడియా నుంచి అప్పుడప్పుడు బ్రేక్ తీసుకునేందుకు వీలుగా ఇన్‌స్టాగ్రామ్ ‘క్వైట్‌ మోడ్‌’ ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్‌‌తో యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి బ్రేక్‌ తీసుకోవాలనుకున్నప్పుడు నోటిఫికేషన్‌లను పాజ్‌ చేయవచ్చు.

Advertisement
Update:2023-01-21 17:10 IST

Instagram quiet mode: ఇన్‌స్టాగ్రామ్‌లో క్వై్ట్ మోడ్! ఎలా పనికొస్తుందంటే..

సోషల్ మీడియా యాప్స్‌లో టాప్‌లో ఉన్న ఇన్‌స్టాగ్రామ్.. స్క్రీన్ టైంను తగ్గించడం కోసం కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. రోజులో ఎక్కువ గంటలు సోషల్‌ మీడియాకే కేటాయిస్తున్న ఈ రోజుల్లో డిజిటల్ బ్రేక్ కోసం ‘క్వైట్ మోడ్’ అనే ఫీచర్‌‌ను తీసుకురాబోతోంది. డిజిటల్ డీటాక్స్‌కు ఈ ఫీచర్ ఎంతగానో హెల్ప్ చేస్తుందని చెప్తోంది. ఇంతకీ ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే..

రోజంతా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, వీడియోలు చూస్తూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటుంటారు చాలామంది. అలాగే రకరకాల పోస్ట్‌లు చేస్తూ.. ఎన్ని లైక్స్‌ వచ్చాయి? ఏ కామెంట్స్‌ వచ్చాయి? అని అదేపనిగా ఆలోచిస్తుంటారు. దీనివల్ల ఒత్తిడి, యాంగ్జైటీ లాంటివి పెరుగుతున్నాయి.


అందుకే సోషల్ మీడియా నుంచి అప్పుడప్పుడు బ్రేక్ తీసుకునేందుకు వీలుగా ఇన్‌స్టాగ్రామ్ ‘క్వైట్‌ మోడ్‌’ ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్‌‌తో యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి బ్రేక్‌ తీసుకోవాలనుకున్నప్పుడు నోటిఫికేషన్‌లను పాజ్‌ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఫాలోవర్స్‌కు లిమిట్ సెట్ చేసుకోవచ్చు.


డైరెక్ట్ మెసేజ్‌లకు ఆటోమేటిక్‌గా రిప్లై ఇచ్చేలా సెట్ చేసుకోవచ్చు. అలాగే సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకున్నట్టు ఇతరులకు తెలియజేసేలా ప్రొఫైల్ యాక్టివిటీ స్టేటస్‌ కూడా మార్చుకోవచ్చు.


ఈ ఫీచర్‌‌లో భాగంగా యూజర్లు తమ షెడ్యూల్‌కు సరిపోయేలా క్వైట్‌ మోడ్‌ అవర్స్‌ను కస్టమైజ్‌ చేసుకోవచ్చు. క్వైట్‌ మోడ్‌లో ఉన్నప్పుడు వచ్చిన ముఖ్యమైన నోటిఫికేషన్లు అన్నింటినీ తర్వాత క్విక్‌ సమ్మరీలో చూడొచ్చు. ఈ కొత్త ఫీఛర్ ప్రస్తుతం అమెరికా, ఇంగ్లండ్, ఐర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే ఇండియన్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

Tags:    
Advertisement

Similar News