రూ.50 వేలకే ఫోల్డబుల్‌ ఫోన్‌

ఏ కంపెనీ.. ఫీచర్స్‌ ఏంటో ఓ లుక్కేయండి

Advertisement
Update:2024-10-17 14:39 IST

చూడటానికి మామూలు ఫోన్ల మాదిరిగా జేబులో ఇమిడిపోయేంతగా కనిపించే ఆ ఫోన్‌ మడత విప్పితే...! అదే ఫోల్డబుల్‌ ఫోన్‌! ఫ్లిప్‌.. ఫోల్డబుల్‌ ఫోన్లకు ఇప్పుడు మస్త్‌ క్రేజ్‌ ఉంది. ధర కూడా భారీగానే ఉంటుంది. బిగ్‌ స్క్రీన్‌ ఎక్స్‌పీరియెన్స్‌.. ఫాస్టెస్ట్‌ గేమింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ కోసం ఆమాత్రం ధర పెట్టేందుకు కుర్రకారు ఏమాత్రం వెనుకాడబోరు. కానీ మధ్య తరగతి వాళ్లకు సకల హంగులతో కూడిన ఓ ఫ్లిప్‌ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. ధర కూడా రూ.50 వేలు మాత్రమే.. అవునూ.. రూ.50 వేలకే ఫోల్డబుల్‌ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ఇన్‌ ఫినిక్స్‌ జీరో ఫ్లిప్‌ పేరుతో ఇండియన్‌ మార్కెట్‌ లో కొత్త మొబైల్‌ ఫోన్‌ లాంచ్‌ చేసింది. 50 మెగా పిక్సెల్‌ కెమెరా, కళ్లు తిప్పుకోలేని ఆకర్శణీయమైన డిజైన్‌ లో ఈ ఫోన్‌ ఔరా అనిపించేలా ఉంది. ఆండ్రాయిడ్‌ 14తో పని చేసే ఈ ఫోన్‌ లో డ్యుయల్‌ సిమ్‌ సదుపాయం ఉంది. మీడియా టెక్‌ డైమన్సిటీ 8,200 ప్రాసెసర్‌ ఇందులో ఏర్పాటు చేశారు. 6.9 అంగులాల ఫుల్‌ హెచ్‌డీ డిస్ ప్లే, 4,720 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 70 వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌ తో అందుబాటులోకి వచ్చిన ఈ ఫ్లిప్‌ ఫోన్‌ తో 4కే వీడియోలు రికార్డ్‌ చేయొచ్చు. 50 మెగాపిక్సల్‌ కెమెరా, 50 మెగా పిక్సల్‌ అల్ట్రై వైడ్‌ కెమెర, 50 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలతో దీనిని అందుబాటులోకి తీసుకువచ్చారు.

Tags:    
Advertisement

Similar News