Infinix Smart 8 | మ్యాజిక్ రింగ్ ఫీచర్‌తో భారత్ మార్కెట్‌లోకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Infinix Smart 8 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ (Infinix) తన ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 (Infinix Smart 8) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది.
Infinix Smart 8 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ (Infinix) తన ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 (Infinix Smart 8) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది. గత నవంబర్‌లో తొలిసారి నైజీరియా మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ ఒక్టాకోర్ మీడియాటెక్ హెలియో జీ36 ఎస్వోసీ (octa-core MediaTek Helio G36 SoC) చిప్‌సెట్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ బేస్డ్ యూఐ ఔటాఫ్ బాక్స్ (Android 13 Go Edition-based UI out-of-the-box) వర్షన్‌పై పని చేస్తుందీ ఫోన్. 50-మెగా పిక్సెల్ డ్యుయల్ కెమెరా యూనిట్‌తో వస్తున్న ఇన్‌ఫినిక్స్ స్మార్ట్-8 (Infinix Smart 8) ఫోన్‌లో మ్యాజిక్ రింగ్ (Magic Ring) ఫీచర్ ఉంటుంది. భారత్ మార్కెట్‌లోకి నాలుగు కలర్ ఆప్షన్లలో సింగిల్ స్టోరేజీ వేరియంట్‌గా వస్తున్నది.
ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 (Infinix Smart 8) ఫోన్ భారత్ మార్కెట్‌లోకి 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్‌గా అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.7,499గా నిర్ణయించారు. సోమవారం నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయాలు ప్రారంభం అవుతాయి. నాలుగు కలర్ ఆప్షన్లు - గెలాక్సీ వైట్, రెయిన్‌బో బ్లూ, షైనీ గోల్డ్, టింబర్ బ్లాక్ కలర్స్‌లో వస్తుంది.
ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 (Infinix Smart 8) ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తోపాటు 6.6- అంగుళాల హెచ్‌డీ+ (1,612 x 720 పిక్సెల్స్) ఐపీఎస్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వస్తున్నది. 12 ఎన్ఎం ఒక్టాకోర్ మీడియాటెక్ హెలియో జీ36 (12nm octa-core MediaTek Helio G36) చిప్ సెట్‌తోపాటు 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ కలిగి ఉంటుంది. వర్చువల్‌గా 8జీబీ ర్యామ్ వరకు పొడిగించుకోవచ్చు. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో రెండు టిగాబైట్ల వరకూ స్టోరేజీ కెపాసిటీ విస్తరించవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ బేస్డ్ ఎక్స్ఓఎస్ 13 (Android 13 Go Edition-based XOS 13) వర్షన్‌పై పని చేస్తుంది.
ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 (Infinix Smart 8) ఫోన్ 50- మెగా పిక్సెల్ కెమెరా రేర్ సెన్సర్ కెమెరా విత్ అన్ స్పెసిఫైడ్ ఏఐ బ్యాక్డ్ లెన్స్, క్వాడ్ లెన్స్ ఎల్ఈడీ రింగ్ ఫ్లాష్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. నోటిఫికేషన్లు, అలర్ట్స్, బ్యాటరీ స్టేటస్ తెలిపేందుకు ఆపిల్ డైనమిక్ ఐలాండ్ (Apple's Dynamic Island) తరహాలో ఈ ఫోన్‌లో మ్యాజిక్ రింగ్ (Magic Ring) ఫీచర్ ఉంటది. ఫ్రంట్ కెమెరా కటౌట్ చుట్టూ మ్యాజిక్ రింగ్ ఫీచర్ కనిపిస్తుంది.
ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 (Infinix Smart 8) ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్బీ టైప్-సీ కనెక్టివిటీతోపాటు సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటది.