Infinix Note 40 Pro 5G Series | 108 మెగా పిక్సెల్స్ కెమెరాతో ఇన్‌ఫినిక్స్ నోట్‌40 ప్రో సిరీస్ ఫోన్లు.. 12న భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌ర‌ణ‌

Infinix Note 40 Pro 5G Series | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ (Infinix) త‌న ఇన్‌ఫినిక్స్ నోట్‌ 40 ప్రో+ 5జీ (Infinix Note 40 Pro+ 5G), ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ (Infinix Note 40 Pro 5G) ఫోన్ల‌ను వ‌చ్చేవారం భార‌త్ మార్కెట్ల‌లో ఆవిష్క‌రించ‌నున్న‌ది.

Advertisement
Update:2024-04-05 11:30 IST

Infinix Note 40 Pro 5G Series | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ (Infinix) త‌న ఇన్‌ఫినిక్స్ నోట్‌ 40 ప్రో+ 5జీ (Infinix Note 40 Pro+ 5G), ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ (Infinix Note 40 Pro 5G) ఫోన్ల‌ను వ‌చ్చేవారం భార‌త్ మార్కెట్ల‌లో ఆవిష్క‌రించ‌నున్న‌ది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లూ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్వోసీ (MediaTek Dimensity 7020 SoC) చిప్‌సెట్‌తో వ‌స్తుంది. ఇన్ హౌస్ చీతా ఎక్స్‌1 ప‌వ‌ర్ మేనేజ్‌మెంట్ చిప్ (Cheetah X1 power management chip), 108 మెగా పిక్సెల్ సెన్స‌ర్ ప్రైమ‌రీ కెమెరా (108-megapixel main sensor)తో ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్‌తో వ‌స్తుంది. భార‌త్ మార్కెట్‌లోకి ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ సిరీస్ ఫోన్లు అమ్ముడ‌వుతాయి.

ఈ నెల 12న భార‌త్ మార్కెట్‌లో ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో+ 5జీ (Infinix Note 40 Pro+ 5G), ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ (Infinix Note 40 Pro 5G) ఫోన్ల‌ను ఆవిష్క‌రిస్తామ‌ని ఇన్‌ఫినిక్స్ ధృవీక‌రించింది. ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఇత‌ర రిటైల్ స్టోర్ల‌లోనూ ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో సిరీస్ పోన్లు అమ్ముడ‌వుతాయి. వీటితోపాటు ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ఫోన్ జ‌త క‌లుస్తుందా..? లేదా..? అన్న సంగ‌తి తెలియ‌రాలేదు.

ఇన్‌ఫినిక్స్ నోట్‌ 40 ప్రో 5జీ సిరీస్ ఫోన్ల‌లో వినియోగించే ఎక్స్ చీతా చిప్‌.. బ్యాట‌రీ లైఫ్‌, ప‌వ‌ర్ మేనేజ్మెంట్ మెరుగు ప‌రుస్తుంది. 45వాట్ల చార్జింగ్ మ‌ద్ద‌తుతో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్, 100 వాట్ల చార్జింగ్ మ‌ద్ద‌తుతో 4600 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో+ 5జీ ఫోన్ వ‌స్తున్న‌ది. వీటిలో 20 వాట్ల వైర్‌లెస్ మ్యాగ్ చార్జ‌ర్ కూడా వ‌స్తుంది. సెలెక్టెడ్ గ్లోబ‌ల్ మార్కెట్ల‌లో ఆవిష్క‌రించిన ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో + 5జీ ఫోన్ సుమారు రూ.25 వేలు (309 డాల‌ర్లు), ఇన్‌ఫినిక్స్ నోట్ 40ప్రో 5జీ ఫోన్ సుమారు రూ.24 వేలు (289 డాల‌ర్లు) ప‌లుకుతుంది.

ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో + 5జీ, ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్‌లు రెండూ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఎక్స్ఓఎస్ 14 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తాయి. రెండు ఫోన్లూ 120 హెర్ట్జ్ డైన‌మిక్ రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + (1,080x2,436 పిక్సెల్స్‌) క‌ర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. 6ఎన్ఎం మీడియా టెక్ డైమెన్సిటీ 7020 ఎస్వోసీ చిప్ సెట్ క‌లిగి ఉంటది. 108 మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరాతో ట్రిపుల్ రేర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్స్ సెన్స‌ర్ కెమెరా ఉంటాయి.

Tags:    
Advertisement

Similar News