Infinix GT 10 Pro | 108-మెగా పిక్సెల్స్ కెమెరాతో ఇన్‌ఫినిక్స్ జీటీ10 ప్రో.. ఆగ‌స్టు 3న లాంచింగ్‌.. ఇవీ డిటైల్స్‌

Infinix GT 10 Pro | భార‌త్ మార్కెట్లో ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ త‌న ఇన్‌ఫినిక్స్‌ జీటీ10 ప్రో (Infinix GT 10 Pro) ఆవిష్క‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు చేసింది.

Advertisement
Update:2023-07-29 15:48 IST

Infinix GT 10 Pro | భార‌త్ మార్కెట్లో ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ త‌న ఇన్‌ఫినిక్స్‌ జీటీ10 ప్రో (Infinix GT 10 Pro) ఆవిష్క‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు చేసింది. వ‌చ్చే గురువారం (ఆగ‌స్టు 3) ఇన్‌ఫినిక్స్ జీటీ10 ప్రో (Infinix GT 10 Pro) భార‌త్ మార్కెట్లోకి వ‌చ్చేస్తుంది. ఈ నేప‌థ్యంలో ఇన్‌ఫినిక్స్ జీటీ 10ప్రో స్పెషిఫికేష‌న్స్ బ‌య‌ట పెట్టింది.

మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ఎస్వోసీ చిప్‌సెట్‌తో ఇన్‌ఫినిక్స్ జీటీ10 ప్రో (Infinix GT 10 Pro) ఫోన్ వ‌స్తోంది. 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్‌గా అందుబాటులోకి వ‌స్తున్న ఇన్‌ఫినిక్స్ జీటీ10 ప్రో.. అమోలెడ్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో ల‌భిస్తుంది. 108- మెగాపిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరాతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్ ఉంటుంది. భార‌త్ మార్కెట్‌లో ఈ ఫోన్ ధ‌ర రూ.20 వేల లోపు ఉండవచ్చున‌ని భావిస్తున్నా.. అస‌లు ధ‌ర మూడో తేదీన ప్ర‌క‌టించనున్న‌ది ఇన్‌ఫినిక్స్‌.

ఇన్‌ఫినిక్స్ జీటీ10 ప్రో (Infinix GT 10 Pro) ఫోన్ ప్రీ ఆర్డ‌ర్స్ ఆగ‌స్టు మూడో తేదీ నుంచి ఈ-కామ‌ర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అవుతాయి. తొలి ఐదు వేల మంది క‌స్ట‌మ‌ర్ల‌కు ప్రో గేమింగ్ గిఫ్ట్ అంద‌చేయ‌నున్న‌ది. సెలెక్టెడ్ బ్యాంక్ కార్డుల‌పై రూ.2000 వ‌ర‌కు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది. ఓల్డ్ ఫోన్ ఎక్స్చేంజ్ మీద మ‌రో రూ.2000 అద‌న‌పు డిస్కౌంట్ పొందొచ్చు. ఆరు నెల‌లపాటు నో-ఈఎంఐ ఆప్ష‌న్ కూడా ఇస్తున్న‌ది.

ఇన్‌ఫినిక్స్ జీటీ10 ప్రో ((Infinix GT 10 Pro) ఫోన్ ఆండ్రాయిడ్ 13 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. ఆండ్రాయిడ్‌-14 వ‌ర్ష‌న్‌తోపాటు రెండేండ్ల వ‌ర‌కూ సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది ఇన్‌ఫినిక్స్‌. 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 10 బిట్స్ అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌, 360 హెర్ట్జ్ ట‌చ్ శాంప్లింగ్ రేట్ క‌లిగి ఉంటుంది. 9000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ల‌భిస్తుంది. డీసీఐపీ క‌ల‌ర్ గ‌మ‌ట్‌పై 100 శాతం క‌వ‌రేజీ ఉంట‌ది.

ఇన్‌ఫినిక్స్ జీటీ10 ప్రో ((Infinix GT 10 Pro) మీడియా టెక్ డైమెన్సిటీ 8050 ఎస్వోసీ చిప్‌సెట్, 8జీబీ ఆఫ్ ఎల్పీడీడీఆర్‌4ఎక్స్ రామ్ అండ్ 256 జీబీ యూఎస్ఎఫ్ 3.1 ఆన్ బోర్డ్ స్టోరేజీ కెపాసిటీ ఉంటుంది. రామ్‌ను 8 జీబీ నుంచి 16 జీబీ వ‌ర‌కు విస్త‌రించుకోవ‌చ్చు. స్టీరియో డ్యుయ‌ల్ స్పీక‌ర్స్ ప‌వ‌ర్డ్ బై డీటీఎస్ ఆడియో టెక్నాల‌జీ, హి-రెస్ ఆడియో స‌ర్టిఫికేష‌న్ ఉంటుంది.

ఇన్‌ఫినిక్స్ జీటీ10 ప్రో ((Infinix GT 10 Pro) ఫోన్‌లో 108-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరా, రెండు 2-మెగా పిక్సెల్ కెమెరాలు, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇన్‌ఫినిక్స్ జీటీ10 ప్రో ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ విత్ 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. వై-ఫై 5 క‌నెక్టివిటీ, బ‌యో మెట్రిక్ అథంటికేష‌న్ కోసం ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ కుంటుంది.

Infinix GT 10 Pro | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ త‌న ఇన్‌ఫినిక్స్ జీటీ10 ప్రో (Infinix GT 10 Pro) ఫోన్ ఆగ‌స్టు మూడో తేదీన మార్కెట్‌లో ఆవిష్క‌రించ‌నున్న‌ది. 108 మెగా పిక్సెల్స్ ప్రైమ‌రీ సెన్స‌ర్‌తోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్‌తో వ‌స్తున్న ఈ ఫోన్ ధ‌ర రూ.20 వేల లోపే ఉండొచ్చు.

Tags:    
Advertisement

Similar News