శాంసంగ్ యూజర్లకు కేంద్రం అలర్ట్.. ఈ ఫోన్స్‌లో ఇష్యూస్!

శాంసంగ్‌ మొబైల్ యూజర్లకు కేంద్రం ముఖ్యమైన అలర్ట్‌ జారీ చేసింది.

Advertisement
Update:2023-12-16 06:00 IST

శాంసంగ్‌ మొబైల్ యూజర్లకు కేంద్రం ముఖ్యమైన అలర్ట్‌ జారీ చేసింది. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లలో కొన్నింటికి సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని వెంటనే వాటిని సెక్యూరిటీ అప్‌డేట్ ద్వారా సరిచేసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

ఆండ్రాయిడ్‌ 11, 12, 13, 14 ఓఎస్‌తో పనిచేసే శాంసంగ్‌ స్మార్ట్ ఫోన్లలో సెక్యూరిటీ పరమైన లోపాలు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ గుర్తించింది. ఈ లోపాల వల్ల వ్యక్తుల పర్సనల్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ వంటివి హ్యాకింగ్ బారిన పడే ప్రమాదముందని హెచ్చరింది. ఆయా ఓఎస్‌లపై పనిచేసే ఫోన్లను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ‘సెర్ట్‌ఇన్‌’ రిపోర్ట్ ప్రకారం శాంసంగ్ మొబైల్ ఫోన్స్‌లో కంట్రోలింగ్ లోపాలు, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు, యాప్స్‌లో ఆథరైజేషన్ సమస్యల వంటి కొన్ని సెక్యూరిటీ బగ్స్ ఉన్నట్టు తెలుస్తొంది. ఆ బగ్స్‌ను ఆసరాగా చేసుకుని ఆయా మొబైల్స్‌ను హ్యాకర్లు ఈజీగా హ్యాక్ చేసే ప్రమాదముంటుంది. కాబట్టి సాఫ్ట్‌వేర్‌లో లోపాలను సరిచేసుకునేందుకు వెంటనే కంపెనీ ప్రొవైడ్ చేసే అప్ డేట్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని ‘సెర్ట్‌ఇన్’ సూచించింది.

శాంసంగ్‌ గెలాక్సీ సిరీస్‌కు చెందిన ‘గెలాక్సీ ఎస్‌23’, ‘గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 5’, ‘గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 5’తోపాటు ఆండ్రాయిడ్‌ 11, 12, 13, 14 వెర్షన్లపై పనిచేసే ఇతర శాంసంగ్ డివైజుల్లో కూడా ఈ లోపం ఉన్నట్లు సెర్ట్‌-ఇన్‌ పేర్కొంది. కాబట్టి యూజర్లు ఫోన్‌ ‘సెట్టింగ్స్‌’లో.. ‘అబౌట్‌ డివైజ్‌’లోకి వెళ్లి.. అక్కడ ‘లేటెస్ట్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌’ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

ఏ మొబైల్ అయినా ఎప్పటికప్పుడు ఫోన్‌ను అప్‌డేట్ చేసుకుంటూ ఉండడం ద్వారా ఓఎస్‌లో ఉన్న లోపాలు ఆటోమేటిక్‌గా సాల్వ్ అవుతూ ఉంటాయి. ఎక్కువకాలం పాటు సాఫ్ట్‌వేర్‌‌ను అప్ డేట్ చేసుకోకపోతే సైబర్ మోసాల బారిన పడే ప్రమాదం ఎక్కువ.

Tags:    
Advertisement

Similar News