అకౌంట్లు హ్యాక్ అవ్వకూడదంటే పాస్‌వర్డ్ ఇలా ఉండాలి!

సోషల్ మీడియా యాప్ అయినా, నెట్ బ్యాంకింగ్ అయినా పాస్‌వర్డ్ స్ట్రాంగ్‌గా ఉంటేనే అకౌంట్ సేఫ్‌గా ఉంటుంది.

Advertisement
Update:2023-11-20 08:30 IST

అకౌంట్లు హ్యాక్ అవ్వకూడదంటే పాస్‌వర్డ్ ఇలా ఉండాలి!

సోషల్ మీడియా యాప్ అయినా, నెట్ బ్యాంకింగ్ అయినా పాస్‌వర్డ్ స్ట్రాంగ్‌గా ఉంటేనే అకౌంట్ సేఫ్‌గా ఉంటుంది. అయితే పాస్‌వర్డ్‌లు సెట్ చేసుకునే విషయంలో ఇప్పటికీ చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నట్టు రీసెంట్ స్టడీలు చెప్తున్నాయి. అసలు పాస్‌వర్డ్ ఎలా ఉండాలంటే..

ప్రపంచంలో ఇప్పటికీ చాలామంది బేసిక్ పాస్‌వర్డ్‌లు వాడుతున్నట్టు ‘నార్డ్‌పాస్’ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ చేసిన సర్వేలో తేలింది. ఎక్కువ మంది వాడుతున్న పాస్‌వర్డ్స్‌లో ‘123456’ ముందుంది. ఆ తర్వాత ‘admin’, ‘password’ వంటివి ఉన్నాయి. సైబర్ నేరాలు ఎక్కువవుతున్న ఈ రోజుల్లో పాస్‌వర్డ్‌లు మరింత పటిష్టంగా సెట్ చేసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. అకౌంట్స్ సేఫ్‌గా ఉంచుకోవడం కోసం యునిక్ పాస్‌వర్డ్స్ పెట్టుకోవాలంటున్నారు.

ఏదైనా అకౌంట్‌కు పాస్ వర్డ్ పెట్టుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం.. పాస్‌వర్డ్ అనేది ఎనిమిది లెటర్స్‌కు తక్కువ ఉండకూడదు. పది లేదా అంతకంటే ఎక్కువ లెటర్స్ ఉంటే ఇంకా మంచిది.

పాస్‌వర్డ్‌లో ఆల్ఫాబెట్స్, నెంబర్స్, సింబల్స్.. ఈ మూడు ఉండేలా చూసుకోవాలి. ఆల్ఫాబెట్స్‌లో ఒకట్రెండు అప్పర్ కేస్‌లు ఉండాలి. అలాగే నెంబర్లు, స్పెషల్ క్యారెక్టర్స్ లేదా సింబల్స్ వంటివి కూడా ఉండాలి.

పాస్‌వర్డ్స్‌గా వ్యక్తుల పేర్లు, ఇంటి పేర్లు, మొబైల్ నెంబర్లు వంటివి పెట్టుకుంటే వాటిని హ్యాక్ చేయడం మరింత తేలికవుతుంది.

వేర్వేరు అకౌంట్లకి ఒకటే పాస్‌వర్డ్‌ను పెట్టకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ పాస్‌వర్డ్‌లు గుర్తుంచుకోలేమనుకుంటే ఒకటే పాస్‌వర్డ్‌లో చిన్నచిన్న మార్పులు చేసి పెట్టుకోవాలి.

ఇకపోతే సోషల్ మీడియా అకౌంట్స్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌లు మరింత స్ట్రాంగ్‌గా సెట్ చేసుకోవాలి. అలాగే నెట్ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌ను ప్రతి మూడు నెలలకొకసారి మారుస్తూ ఉండాలి.

పాస్‌వర్డ్‌ని ఎవ్వరితో షేర్ చేసుకోకూడదు. పాస్‌వర్డ్ ఎవరికైనా తెలిసినట్టు అనుమానం వస్తే వెంటనే దాన్ని మార్చేయాలి. ఎక్కువ పాస్‌వర్డ్‌లను మర్చిపోకుండా ఉండేందుకు పాస్‌వర్డ్ మెనేజర్ వంటి యాప్స్ వాడొచ్చు.

Tags:    
Advertisement

Similar News