ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్.. ఎలాగంటే..

ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఫీచర్ ద్వారా యూఎస్‌ఎస్‌డి(USSD) కోడ్‌ని ఉపయోగించి ఇంటర్నెట్ లేకుండా యూపిఐ ద్వారా పేమెంట్స్ చేయొచ్చు.

Advertisement
Update:2022-11-22 15:28 IST

ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్.. ఎలాగంటే..

మొబైల్‌లో యూపిఐ ద్వారా పేమెంట్స్ చేయాలంటే కచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సిందే. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు లేదా కనెక్షన్ వీక్‌గా ఉన్నప్పుడు యూపీఐ పేమెంట్స్ చేయడం కోసం 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' కొత్త సౌకర్యాన్ని తీసుకొచ్చింది.

ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఫీచర్ ద్వారా యూఎస్‌ఎస్‌డి(USSD) కోడ్‌ని ఉపయోగించి ఇంటర్నెట్ లేకుండా పేమెంట్స్ చేయొచ్చు. దానికోసం ముందుగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి *99# డయల్ చేయాలి. ఆ తర్వాత మీ బ్యాంకు పేరు సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ అడుగుతుంది. అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

ఆ తర్వాత సెండ్ మనీ, రిక్వెస్ట్ మనీ, చెక్ బ్యాలెన్స్, యూపీఐ పిన్ వంటి ఆప్షన్లు ఉంటాయి. ఇతరులకు డబ్బు పంపాలనుకుంటే.. '1' సెండ్ మనీని ఎంటర్‌ చేయాలి.

తర్వాత ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు పంపాలనుకుంటున్నారో ఆ వివరాలను ఎంచుకోవాలి. తర్వాత మొబైల్ నంబర్, యూపీఐ ఐడీ, డబ్బు పంపాల్సిన వ్యక్తి కాంటాక్ట్ నెంబర్ వివరాలు టైప్‌ చేసి 'సెండ్' పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత పంపాలనుకుంటున్న అమౌంట్ మొత్తాన్ని ఎంటర్‌ చేయాలి. చివరిగా మీ యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేసి 'సెండ్' ఆప్షన్‌ క్లిక్‌ చేస్తే ఇంటర్నెట్‌ లేకుండానే మీ పేమెంట్ పూర్తవుతుంది

Tags:    
Advertisement

Similar News