సమ్మర్‌లో ఫోన్ వేడెక్కకుండా ఉండాలంటే..
ఎండాకాలం వేడి వాతావరణానికి స్మార్ట్‌ఫోన్స్ మరింత వేడెక్కే అవకాశముంది. ఫోన్ వేడెక్కితే.. ప్రాసెసర్, స్క్రీన్, బ్యాటరీ వంటివి పాడయ్యే అవకాశం ఉంది. హీట్ మరీ ఎక్కువైతే మొబైల్స్ పేలిపోయే ప్రమాదమూ ఉంది.
మామూలుగానే కొన్ని మొబైల్స్ కాస్త వాడగానే హీట్ అవుతుంటాయి. అలాంటిది ఎండాకాలం వేడి వాతావరణానికి స్మార్ట్‌ఫోన్స్ మరింత వేడెక్కే అవకాశముంది. ఫోన్ వేడెక్కితే.. ప్రాసెసర్, స్క్రీన్, బ్యాటరీ వంటివి పాడయ్యే అవకాశం ఉంది. హీట్ మరీ ఎక్కువైతే మొబైల్స్ పేలిపోయే ప్రమాదమూ ఉంది. అందుకే సమ్మర్‌లో ఫోన్ హీట్ అవ్వకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
స్మార్ట్‌ఫోన్ వేడెక్కినట్టు గమనిస్తే.. వెంటనే లాక్ చేసి పక్కన పెట్టాలి. అరగంట సేపు స్విచ్ ఆఫ్ చేస్తే ఫోన్ నెమ్మదిగా చల్లబడుతుంది.
సమ్మర్‌లో బయట ఫోన్ వాడేటప్పుడు ఫోన్‌కు నేరుగా ఎండ తగలకుండా చూసుకోవాలి. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఫోన్ బ్యాక్ కవర్ తీసి ఉపయోగించడం వల్ల ఫోన్ హీట్ అవ్వడం తగ్గుతుంది.
గేమ్స్ ఎక్కువగా ఆడేవాళ్లు ఫోన్ హీట్ ఎక్కకుండా ఉండేందుకు కూలింగ్ ఫ్యాన్స్ లాంటివి వాడితే మంచిది. అలాగే మొబైల్ ఛార్జ్ చేసేటప్పుడు గాలి తగిలే ప్లేస్‌లో ఉంచాలి.
ఫోన్‌తోపాటు వచ్చిన చార్జర్లను, బ్యాటరీలను కాకుండా వేరే వాటిని వాడడం వల్ల ఫోన్లు త్వరగా వేడెక్కుతాయి. కాబట్టి మొబైల్ హీట్ అవుతున్నట్టు గమనిస్తే ఒరిజినల్ ఛార్జర్‌ను వాడాలి.
పగిలిన ఫోన్లను రిపేర్ చేసిన తర్వాతే ఉపయోగించాలి. అలాంటి ఫోన్లు త్వరగా హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది. హీట్ అవుతున్నా అలాగే వాడితే ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంది.
మొబైల్ తరచుగా వేడెక్కుతున్నట్లు గమనిస్తే.. వెంటనే సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లి చెక్ చేయించడం మంచిది.