ఫేక్ న్యూస్ ఇలా కనిపెట్టొచ్చు

వాట్సాప్‌లో రకరకాల వార్తలు ఫార్వర్డ్ అవుతుంటాయి. వాటిలో ఏది ఒరిజినల్? ఏది ఫేక్? అనేది తెలియక చాలామంది ఫేక్ న్యూస్‌ను కూడా ఇతరులకు షేర్ చేస్తుంటారు

Advertisement
Update:2023-03-25 01:23 IST

How to identify Real or Fake News: ఫేక్ న్యూస్ ఇలా కనిపెట్టొచ్చు

వాట్సాప్‌లో రకరకాల వార్తలు ఫార్వర్డ్ అవుతుంటాయి. వాటిలో ఏది ఒరిజినల్? ఏది ఫేక్? అనేది తెలియక చాలామంది ఫేక్ న్యూస్‌ను కూడా ఇతరులకు షేర్ చేస్తుంటారు. అయితే ఫేక్ న్యూస్‌ను కనిపెట్టేందుకు వాట్సాప్‌లో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి.

వాట్సాప్‌లో హల్‌చల్ అయ్యే ఫేక్ న్యూస్‌ను అరికట్టేందుకు ‘ఏఎఫ్‌పీ’, ‘బూమ్’, ‘ఫ్యాక్ట్‌లీ’ లాంటి కొన్ని ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థలు పనిచేస్తున్నాయి. ఏదైనా న్యూస్ సర్క్యులేట్ అయినప్పుడు ఆయా సంస్థల చాట్‌బాట్‌లకు వాటిని ఫార్వర్డ్ చేస్తే చాలు. అది ఫేక్ న్యూస్ అవునో కాదో తెలిసిపోతుంది.

ఏఎఫ్‌పీ(+91 95999 73984), బూమ్(+91 77009 06111), ఫ్యాక్ట్‌లీ(+91 92470 52470) నెంబర్లలో ఒక దానిని సేవ్ చేసుకుని న్యూస్‌ను వాటికి ఫార్వర్డ్ చేస్తే చాలు. అది నిజమైనదా? కాదా? అనేది తెలుసుకోవచ్చు. అలాగే ‘ది హెల్దీ ఇండియన్ ప్రాజెక్ట్(+91 85078 85079)’ అనే చాట్‌బాట్ అచ్చంగా హెల్త్‌కు సంబంధించిన ఫేక్ వార్తలను చెక్ చేసి చెప్తుంది. ఫుడ్, హెల్త్, జబ్బులకు సంబంధించిన న్యూస్‌లు వస్తే ఆ నెంబర్‌‌కు పంపొచ్చు.

Tags:    
Advertisement

Similar News