సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేముందు ఇవి చెక్ చేయండి!

మంచి ఫీఛర్లుండే ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌ను ఎక్కువ ధర పెట్టి కొనలేని వాళ్లు సెకండ్ హ్యాండ్ ఆప్షన్స్ కోసం చూస్తుంటారు. అమెజాన్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో కూడా రిఫర్బిష్డ్ మొబైల్స్ పేరుతో బాక్స్ ఓపెన్ చేసిన, వాడిన మొబైల్స్ దొరుకుతున్నాయి.

Advertisement
Update:2023-11-25 10:45 IST

మంచి ఫీఛర్లుండే ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌ను ఎక్కువ ధర పెట్టి కొనలేని వాళ్లు సెకండ్ హ్యాండ్ ఆప్షన్స్ కోసం చూస్తుంటారు. అమెజాన్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో కూడా రిఫర్బిష్డ్ మొబైల్స్ పేరుతో బాక్స్ ఓపెన్ చేసిన, వాడిన మొబైల్స్ దొరుకుతున్నాయి. ఈ ఆప్షన్ మంచిదే అయినా ఇలాంటివి కొనేముందు కొన్ని విషయాలు చెక్ చేసుకోవాలి. అవేంటంటే..

సెకండ్ హ్యాండ్ మొబైల్స్‌లో రెండు రకాలుంటాయి. సాధారణంగా షాపుల్లో అమ్మే ఫోన్లు, ఆన్‌లైన్‌లో దొరికే రిఫర్బిష్డ్ ఫోన్లు. షాపుల్లో దొరికే ఫోన్స్ ఆల్రెడీ ఒకరు వాడి అమ్మేసినవి. ఇలాంటివి కొనేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఓరిజినలా? కాదా ? లేదా ఎవరైనా దొంగిలించి అమ్ముతున్నారా? అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి.

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనేముందు అది చోరీకి గురైన మొబైల్ అవునా? కాదా? అన్నది తెలుసుకునేందుకు ‘సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌’ పోర్టల్‌ను సంప్రదించాలి. సీఈఐఆర్ వెబ్‌సైట్ (www.ceir.gov.in) లోకి వెళ్లి అక్కడ అప్లికేషన్‌ మెనూలో ‘IMEI Verification’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీ మొబైల్‌ నెంబర్‌ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేశాక ఐఎంఈఐ నెంబర్ టైప్ చేయాలి. ఐఎంఈఐ నెంబర్‌ కోసం మొబైల్ లో ‘*#06#’ డయల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ‘సబ్మిట్‌’ నొక్కితే మొబైల్ వివరాలు వస్తాయి. అలా ఆ ఫోన్‌ ఒరిజినలా? కాదా? అన్నది తెలుసుకోవచ్చు. ఒకవేళ అది దొంగిలించిన ఫోన్ అయితే ఆ నెంబర్‌‌పై కంప్లెయింట్ రిజిస్టర్ అయ్యి ఉంటుంది. ఆ వివరాలు పోర్టల్‌లో కనిపిస్తాయి.

ఇక రిఫర్బిష్డ్ మొబైల్స్ విషయానికొస్తే.. ఇవి పాక్షికంగా వాడిన మొబైళ్లు. అంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి.. ఫోన్‌లో ఏదైనా సమస్య ఉంటే మళ్లీ రిటర్న్ చేసిన ఫోన్లు. ఇలాంటి మొబైల్స్‌ను రిపేర్ చేసి రిఫర్బిష్డ్ మొబైల్స్ పేరుతో అమ్మకానికి పెడుతుంటారు. ఇలాంటి మొబైల్స్ కొనేముందు సెల్లర్‌‌ను ముందుగా సంప్రదించి సమస్య ఏంటి అన్నది తెలుసుకుంటే మంచిది. అమెజాన్‌లో సెల్లర్‌‌తో ఛాట్ చేసే ఆప్షన్ ఉంటుంది. మొబైల్‌లో చిన్నచిన్న స్క్రాచ్‌లు ఉన్నకారణంగా రిటర్న్ చేసిన ఫోన్లు అయితే ఇబ్బంది ఉండదు. ఒకవేళ సాఫ్ట్‌వేర్ సమస్యలుంటే అది తర్వాత సమస్యగా మారొచ్చు.

రిఫర్బి్ష్డ్ మొబైల్స్ కొనేముందు వారెంటీ ఉన్న వాటిని ఎంచుకోవాలి. మొబైల్ కండిషన్ ఎలా ఉందో సెల్లర్ ద్వారా ముందే చెక్ చేసుకోవాలి. మొబైల్‌లో ఏవైనా పార్ట్‌లు రీప్లేస్ చేశారేమో అడిగి తెలుసుకోవాలి. అలాగే ధర విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఒకసారి బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత అది సెకండ్ హ్యాండ్ కిందకు వస్తుంది కాబట్టి అసలు ధరలో కనీసం 40 శాతం తగ్గింపు ఉంటే అలాంటి మొబైల్స్ తీసుకోవచ్చు. రిఫర్బిష్డ్ మొబైల్స్ ఈఎంఈఐ నెంబర్‌‌ను కూడా ఒకసారి సీఈఐఆర్ పోర్టల్‌లో చెక్ చేయడం మంచిది.

Tags:    
Advertisement

Similar News