ఒక మొబైల్‌ను ఎంతకాలం వాడాలో తెలుసా?
రోజువారీ జీవితంలో స్మార్ట్ ఫోన్ అనేది ముఖ్యమైన గ్యాడ్జెట్. అయితే చాలామంది మొబైల్ ప్రియలు ఏడాదికొక సారి కొత్త మొబైల్‌ను మారుస్తుంటారు.
రోజువారీ జీవితంలో స్మార్ట్ ఫోన్ అనేది ముఖ్యమైన గ్యాడ్జెట్. అయితే చాలామంది మొబైల్ ప్రియలు ఏడాదికొక సారి కొత్త మొబైల్‌ను మారుస్తుంటారు. మరికొంతమంది ఒకే ఫోన్‌ను ఐదారేళ్లు వాడుతుంటారు. అసలు ఒక మొబైల్‌ను ఎంత కాలం వాడొచ్చు? కొత్త ఫోన్ ఎప్పుడు తీసుకోవాలి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
స్మార్ట్‌ఫోన్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఏమీ ఉండదు. కానీ, మొబైల్ ఎంతకాలం వాడాలి? అన్న ప్రశ్న వచ్చినప్పుడు అందులో ఉండే బ్యాటరీ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వంటి కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. అదెలాగంటే..
సాధారణంగా అందరూ ఫోన్ కొనేటప్పుడు అందులో ఉండే ఫీచర్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంటారు. అలాగే సేల్‌లో తక్కువ ధరకు వచ్చే మోడల్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే వీటితోపాటు అది తయారైన సంవత్సరం, సాఫ్ట్‌వేర్ అప్ డేట్స్ ఎంతకాలం వస్తాయి? అనే విషయాలు కూడా గమనించాలి.
ఫోన్ కొనేముందు దాని మన్యుఫాక్చరింగ్ డేట్ గమనించాలి. వీలైనంత వరకూ ప్రస్తుత సంవత్సరంలో తయారైనదాన్ని తీసుకోవాలి. అలాగే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఎన్నేళ్ల పాటు వస్తాయో చూసుకుని తీసుకోవాలి. మరో ఏడాదికి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఆగిపోయే మొబైల్‌ను తీసుకోవడం ద్వారా డబ్బు వృథా చేసినట్టు అవుతుంది.
సాధారణంగా చాలా బ్రాండ్స్ రెండేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇస్తుంటాయి. శాంసంగ్, మొటొరొలా వంటి బ్రాండ్స్ కాస్త ఎక్కువ కాలం పాటు అప్‌డేట్స్ ఇస్తుంటాయి. శాంసంగ్ సుమారు నాలుగేళ్లపాటు సాఫ్ట్‌వేర్ అండ్ సెక్యూరిటీ అప్‌డేట్స్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే శాంసంగ్ మొబైల్స్‌ను నాలుగేళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు.
ఇకపోతే మొబైల్‌లో గమనించాల్సిన మరో విషయం బ్యాటరీ లైఫ్ టైం. ప్రతి స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ వెనుక దాని ఎక్స్‌పైరీ డేట్ రాసి ఉంటుంది. ఆ డేట్ తర్వాత బ్యాటరీ క్షీణించే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాటరీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే బ్యాటరీని మార్చుకోవచ్చు.
ఇక మరో ముఖ్యమైన విషయం కొన్ని బ్రాండ్స్.. నాలుగైదు ఏళ్ల తర్వాత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌తో పాటు యాక్సెసరీస్‌ను తయారుచేయడం కూడా ఆపేస్తాయి. అలాంటప్పుడు మొబైల్ పార్ట్స్ చెడిపోతే రిపేర్ చేయించుకోవడం కుదరదు. కాబట్టి అలాంటి సందర్భాల్లోమొబైల్ మార్చక తప్పదు.
మొత్తంగా ఈ రోజుల్లో వస్తున్న మొబైల్స్, బ్యాటరీస్, ప్రాసెసర్ల పనితీరుని బట్టి నాలుగేళ్ల పాటు ఒక మొబైల్‌ను వాడుకోవచ్చనేదని నిపుణుల సలహా. ఆ తర్వాత కూడా వాడుకోవచ్చు. కానీ, సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ.