మాట్లాడే ఎమోజీలు! గూగుల్ కొత్త ఫీచర్ !

త్వరలోనే మాట్లాడే ఎమోజీలను తీసుకురానున్నట్టు గూగుల్ తాజాగా ప్రకటించింది.

Advertisement
Update:2024-05-25 18:18 IST

వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా యాప్స్ వాడేవారికి ఎమోజీల గురించి తెలిసే ఉంటుంది. ఛాటింగ్‌ల్లో మాటలతో చెప్పలేని ఎమోషన్స్‌ను ఎమోజీల ద్వారా చెప్పొచ్చు. అయితే ఇప్పుడీ ఎమోజీలు కూడా అప్‌డేట్ అవుతున్నాయి. త్వరలోనే మాట్లాడే ఎమోజీలను తీసుకురానున్నట్టు గూగుల్ తాజాగా ప్రకటించింది. ఇవెలా పనిచేస్తాయంటే..

ఛాటింగ్‌ చేసేటప్పుడు అవతలి వ్యక్తికి మన హావభావాలు తెలిపేందుకు వీలుగా ఎమోజీలను క్రియేట్ చేశారు. ఇవి మొదట మెయిల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉండేవి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరింత పాపులర్ అయ్యాయి. ఈ ఎమోజీల్లో వందల రకాలుంటాయి. ఒక్కో సింబల్‌కు ఒక్కో అర్థం ఉంటుంది. అప్‌డేట్స్‌లో కొత్తవి కూడా వచ్చి చేరుతుంటాయి. అయితే తాజాగా గూగుల్ ‘ఆడియో ఎమోజీ’ పేరుతో ఓ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇదెలా ఉంటుందంటే..

స్టాటిక్ ఎమోజీలతో పాటు కదిలే ఎమోజీలు కూడా మనం చూస్తుంటాం. అయితే ఇప్పుడు రాబోయేది మాట్లాడే ఎమోజీలన్న మాట. ఈ ఆడియో ఎమోజీలు ఫోన్ కాల్స్‌ మాట్లాడేటప్పుడు యూజ్‌ఫుల్‌గా ఉంటాయని గూగుల్ చెప్తోంది. కాల్స్ మాట్లాడుకునేటప్పుడు ఎమోజీల ద్వారా సౌండ్ ఎఫెక్ట్‌లను పంపుకోవచ్చు. తద్వారా సంభాషణ మరింత మెరుగ్గా ఉంటుంది.

సరికొత్త ఆడియో ఎమోజీల్లో బాధ, చప్పట్లు, సెలబ్రేషన్స్, నవ్వు.. ఇలా భిన్నమైన ఎమోషన్స్‌కు తగ్గట్టుగా కొన్ని సౌండ్ ఎఫెక్ట్‌లను కాల్స్ మాట్లాడేప్పుడు పంపుకోవచ్చు. ఈ ఫీచర్ ఫోన్ స్పీకర్ మోడ్‌లో ఉన్నప్పుడు మాత్రమే పని చేస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ ఫోన్స్‌లో బీటా యూజర్స్‌కు అందుబాటులో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.

Tags:    
Advertisement

Similar News