గూగుల్ పిక్సెల్ 9 వచ్చేస్తోంది! ప్రత్యేకతలివే!

ఈ నెల14న గ్లోబల్ మార్కెట్లో ‘గూగుల్ పిక్సెల్ 9 (Google Pixel 9)’ మొబైళ్లు లాంఛ్ అవ్వనున్నాయి. ఇందులో పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ అను నాలుగు మొబైళ్లు ఉండనున్నాయి.

Advertisement
Update:2024-08-13 17:47 IST

టెక్ దిగ్గజం గూగుల్.. తన లేటెస్ట్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లను గ్లోబల్ మార్కెట్లోకి లాంఛ్ చేయనుంది. ఈ సిరీస్‌లోని ఫోన్లు, వాటి ప్రత్యేకతలు, ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ నెల14న గ్లోబల్ మార్కెట్లో ‘గూగుల్ పిక్సెల్ 9(Google Pixel 9)’ మొబైళ్లు లాంఛ్ అవ్వనున్నాయి. ఇందులో పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ అను నాలుగు మొబైళ్లు ఉండనున్నాయి. ఇండియన్ మార్కెట్లో ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కూడా ఈ మొబైల్స్ లభిస్తాయి.

గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లు గూగుల్ టెన్సార్ జీ4 ప్రాసెసర్‌‌పై పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ గూగుల్ ఓఎస్‌పై పనిచేస్తాయి. పిక్సెల్ 9 ఫోన్.. 6.3 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుని సపోర్ట్ చేస్తుంది. ఇందులో 50 ఎంపీతో కూడిన డ్యుయల్ కెమెరా, 10.5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటాయి.

గూగుల్ పిక్సెల్ 9 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 15 వాట్ వైర్‌‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ యూఎఫ్‌ఎస్ 4.0 స్టోరేజీతో వస్తుంది. ఐపీ68 రేటింగ్ ఉంది. గ్లాస్ బిల్డ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ. 60 వేల వరకూ ఉండొచ్చు.

ఇక పిక్సెల్ 9 ప్రో మొబైల్ 6.1 ఇంచ్ ఓఎల్‌ఈడీ స్క్రీన్, 144 రీఫ్రెష్ రేటుతో వస్తుంది. 50 ఎంపీ ట్రిపుల్ కెమెరాతో పాటు 50 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ధర రూ. లక్ష వరకూ ఉండొచ్చు. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ మొబైల్ 8 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 6.24 ఇంచ్ ఔటర్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌‌తో కూడిన ట్రిపుల్ కెమెరా, 10 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటాయి. ధర రూ. 1,70,000 ఉండొచ్చు.

Tags:    
Advertisement

Similar News