ఈ గూగుల్ మ్యాప్స్ ఫీచర్‌తో ఫ్యూయెల్ సేవ్ చేయొచ్చు!
వాహనంలో ఫ్యూయెల్ ను సేవ్ చేసేందుకు గూగుల్ మ్యాప్స్.. ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ సరికొత్త ఫీచర్ సాయంతో రద్దీ తక్కువ ఉన్న రూట్స్‌లో డ్రైవ్ చేస్తూ.. చాలావరకు ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు.
వాహనంలో ఫ్యూయెల్ ను సేవ్ చేసేందుకు గూగుల్ మ్యాప్స్.. ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ సరికొత్త ఫీచర్ సాయంతో రద్దీ తక్కువ ఉన్న రూట్స్‌లో డ్రైవ్ చేస్తూ.. చాలావరకు ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు.ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే..
గూగుల్ మ్యాప్స్ తీసుకొచ్చిన ఫ్యూయెల్ సేవింగ్ ఫీచర్.. మీ వెహికల్, ఇంజిన్‌ను బట్టి ఫ్యూయెల్‌ను సేవ్ చేసే రూట్స్‌ను చూపిస్తుంది. బండి ఇంజిన్ రకాన్ని బట్టి ఏ రూట్‌లో వెళ్తే ఎంత ఫ్యూయెల్ ఖర్చు అవుతుందో అంచనా వేసి మీకు చూపిస్తుంది. తద్వారా మీకు నచ్చిన రూట్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు.
గూగుల్ మ్యాప్స్ ఫ్యూయెల్ సేవింగ్ ఫీచర్ ద్వారా ఫ్యూయెల్ ఖర్చు తగ్గడంతోపాటు టైం కూడా కలిసొస్తుంది. అయితే వాహనదారులు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసినప్పుడు వీలైనంత తక్కువ దూరం ఉండే రూట్ లేదా బండి రకాన్ని బట్టి ఏ రూట్‌లో వెళ్తే ఖర్చు కలిసొస్తుందో లెక్కగట్టి రూట్ సజెషన్ ఇస్తుంది. ఒకవేళ ఆ రూట్‌లో ట్రాఫిక్ ఉంటే ఫీచర్ ను ఆఫ్ చేసి మరో రూట్‌ను ఎంచుకోవడం మంచిది. ఈఫీచర్‌ను ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే..
ఫ్యూయెల్ సేవింగ్ ఫీచర్ కోసం ముందుగా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేసి, ‘సెట్టింగ్స్’లోకి వెళ్లాలి. అక్కడ ‘నేవిగేషన్’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ‘రూట్ ఆప్షన్స్’ కనిపిస్తాయి. అందులో ‘ఫ్యూయెల్ ఎఫీషియంట్ రూట్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత ‘ఇంజిన్ టైప్’ సెక్షన్‌లో మీ బండి ఇంజిన్ టైప్‌ను ఎంటర్ చేస్తే.. ఇంజిన్ రకాన్ని బట్టి రూట్ సజెషన్స్ పొందొచ్చు. అయితే ఈ ఫీచర్లో డిఫాల్ట్‌గా పెట్రోల్ ఇంజిన్ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. మీ వాహనం డీజిల్ లేదా సీఎన్‌జీ అయితే ఇంజిన్ టైప్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది.
ఇకపోతే రీసెంట్‌గా గూగుల్ మ్యా్ప్స్.. రియల్ టైమ్ స్పీడ్ లిమిట్ తెలియజేసేలా స్పీడోమీటర్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. గూగుల్ మ్యాప్స్ సెట్టింగ్స్‌లో ‘నేవిగేషన్’ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ డ్రైవింగ్ ఆప్షన్స్‌లో ‘స్పీడోమీటర్’ను ఎనేబుల్ చేసుకుంటే మీరు ఎంత వేగంతో ప్రయాణిస్తున్నారో చూపిస్తుంది. ఆయా హైవేలపై ఉన్న స్పీడ్ లిమిట్స్ ప్రకారం మిమ్మల్ని హెచ్చరిస్తుంది కూడా.